Masala Buttermilk: మసాలా మజ్జిగతో బోలెడు లాభాలు.. తయారుచేయడం మరింత సులువు..!

Masala Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగడం వల్ల చలువు చేస్తుందని తరచుగా పెద్దలు చెబుతుంటారు.

Update: 2023-06-22 14:00 GMT

Masala Buttermilk: మసాలా మజ్జిగతో బోలెడు లాభాలు.. తయారుచేయడం మరింత సులువు..!

Masala Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగడం వల్ల చలువు చేస్తుందని తరచుగా పెద్దలు చెబుతుంటారు. వాస్తవానికి ఇది నిజం. ఎందుకంటే మజ్జిగ ఒక పాల ఉత్పత్తి. దీనిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. పొట్టకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోతుంది. శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. మజ్జిగలో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. అందుకే దీనిని తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అయితే కొంచెం మసాలా జోడించి దీనికి రుచికరంగా తయారుచేయవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

మసాలా మజ్జిగ తయారీకి కావలసిన పదార్థాలు

2 కప్పుల పెరుగు

2 టేబుల్‌ స్పూన్ల కాల్చిన జీలకర్ర పొడి

1/2 టేబుల్‌ స్పూన్ల తరిగిన పచ్చిమిర్చి

1/4 కప్పు తరగిన పుదీనా ఆకులు

1/4 కప్పు తరిగిన పచ్చి కొత్తిమీర ఆకులు

1 టేబుల్‌ స్ఫూన్‌ బ్లాక్ ఉప్పు

మసాలా మజ్జిగ తయారీ ఎలా..?)

మసాలా మజ్జిగ తయారుచేయడానికి ముందుగా పుదీనా ఆకులు, పచ్చి కొత్తిమీర తీసుకొని వాటి కాడలని వేరుచేయాలి. పచ్చి మిరపకాయలను చిన్నగా కట్‌ చేయాలి. తరువాత మిక్సర్‌లో పుదీనా ఆకులు, పచ్చి కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి వేసి అందులో అరకప్పు పెరుగు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి మెత్తగా పేస్టులా అయ్యేవరకు రుబ్బుకోవాలి.

తర్వాత దీనిని ఒక పాత్రలో భద్రపరుచుకోవాలి. మిగిలిన ఒకటిన్నర కప్పు పెరుగు, రుచికి తగిన ఉప్పు వేసి, రెండున్నర కప్పుల చల్లని నీరు కలపాలి. తర్వాత ఒక చర్నర్ సహాయంతో పెరుగును 2 నుంచి 3 నిమిషాలు బాగా కలపాలి. అంతే చల్లని మసాలా మజ్జిగ రెడి అయినట్లే. ఆపై గ్లాస్‌లో ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. లేదంటే కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసుకొని సర్వ్‌ చేసినా సూపర్‌గా ఉంటుంది.

Tags:    

Similar News