Health News: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అడ్రినల్ ఫెటీగ్ అయ్యే అవకాశం..!
Health News: ఈరోజుల్లో అడ్రినల్ ఫెటీగ్ ప్రధాన వ్యాధిగా మారుతోంది.
Health News: ఈరోజుల్లో అడ్రినల్ ఫెటీగ్ ప్రధాన వ్యాధిగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది శరీరాన్ని బలహీనంగా, నీరసంగా మారుస్తుంది. రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలను చేయడం కష్టతరం అవుతుంది. అడ్రినల్ గ్రంథులు సరైన రీతిలో పని చేయనప్పుడు అడ్రినల్ ఫెటీగ్ లేదా అడ్రినల్ ఎగ్జాస్షన్ అని పిలవబడే పరిస్థితి ఏర్పడుతుంది.
అడ్రినల్ ఫెటీగ్ ఎందుకు వస్తుంది?
ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడికి గురైనప్పుడు అడ్రినల్ ఫెటీగ్ వస్తుంది. ఈ సమయంలో గ్రంథులు శరీర అవసరాలను తీర్చలేవు. అధిక అలసట, నిద్రలేకపోవడం, విపరీతమైన ఒత్తిడి, తీపి, ఉప్పగా ఉండే ఆహారం ఎక్కువగా తినడం, బద్ధకం, తక్కువ శక్తి, మహిళల్లో ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయంలో తక్కువ రక్తపోటు వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.
అడ్రినల్ ఫెటీగ్ చికిత్సకి ఆహారాలు
1. విటమిన్ B5 - దీనిని పాంతోతేనిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఇది ఒత్తిడి సమయంలో కార్టిసాల్ స్రావాన్ని సమతుల్యం చేస్తుంది.
2. ఆస్ట్రాగాలస్ - ఇది ఒక రకమైన పువ్వు. దీనిని కూరగాయగా ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది.
3. విటమిన్ B6 - దీనిని పిరిడాక్సిన్ అంటారు. ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.
4. విటమిన్ సి - విటమిన్ సి నారింజ, నిమ్మకాయలలో లభిస్తుంది. ఇది అడ్రినల్ అలసటను తగ్గిస్తుంది.
5. కార్డిసెప్స్ - ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది కాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
6. విటమిన్ ఇ - ఈ పోషకం అడ్రినల్ గ్రంథిలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.