Skin Allergies: చర్మ వ్యాధులకు కారణాలు ఏంటి.. లక్షణాలు, నివారణలు తెలుసుకోండి..!

Skin Allergies: ఈ రోజుల్లో చాలా మంది చర్మ వ్యాధులకు గురవుతున్నారు. సాధారణంగా ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం, మందుల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చర్మ అలెర్జీలు సంభవిస్తాయి.

Update: 2023-11-03 01:30 GMT

Skin Allergies: చర్మ వ్యాధులకు కారణాలు ఏంటి.. లక్షణాలు, నివారణలు తెలుసుకోండి..!

Skin Allergies: ఈ రోజుల్లో చాలా మంది చర్మ వ్యాధులకు గురవుతున్నారు. సాధారణంగా ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం, మందుల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చర్మ అలెర్జీలు సంభవిస్తాయి. వీటికి సకాలంలో చికిత్స తీసుకోకుంటే వేగంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఏదైనా చర్మ సంబంధిత వ్యాధి మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. చర్మ వ్యాధుల ప్రారంభ లక్షణాలు, నివారణ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వాతావరణంలో మార్పుల కారణంగా, వైరల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. దీని కారణంగా చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు కనిపిస్తాయి. కాలుష్యం చర్మంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. దీపావళి సమయంలో పటాకుల వల్ల కాలుష్యం చాలా పెరుగుతుంది. ఇది చర్మానికి చాలా ప్రమాదకరం. వాయు కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ క్రీమ్ వాడాలి. మంచి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.

చర్మంపై తరచుగా దురద

చర్మంపై దురదలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, దద్దుర్లు వంటి దురదలు మళ్లీ మళ్లీ వచ్చే కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు. ఈ వ్యాధులలో దురద ఎక్కువవుతున్నట్లయితే ఒకసారి చర్మ నిపుణులను సంప్రదించడం మంచిది.

చర్మంపై దద్దుర్లు , రంగు మారడం

చర్మంపై దద్దుర్లు, రంగు మారడం అనేది వేరే కారణాల వల్ల జరుగుతుంది. చర్మం తరచుగా తెల్లగా, నల్లగా మారుతుంటుంది. ఏదైనా చికిత్స చేసిన ప్రదేశంలో చర్మం నల్లగా మారుతుంది. ఇది కొంత కాలానికి సాధారణమవుతుంది.

బయట భోజనం వద్దు

బయట భోజనం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల చాలా సార్లు అలెర్జీలు, దద్దుర్లు ఏర్పడుతాయి. సాధారణంగా ఇది దానంతటదే వెళ్లిపోతుంది కానీ ఉపశమనం లభించకపోతే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

Tags:    

Similar News