Chest Pain Reasons: ఛాతినొప్పికి కారణాలు ఇవే.. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే చాలా ప్రమాదం..!
Chest Pain Reasons: ఛాతినొప్పి విషయంలో చాలామంది గందరగోళ పరిస్థితులని ఎదుర్కొంటారు. అందరు గుండెనొప్పిగా భావిస్తారు.
Chest Pain Reasons: ఛాతినొప్పి విషయంలో చాలామంది గందరగోళ పరిస్థితులని ఎదుర్కొంటారు. అందరు గుండెనొప్పిగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు ఇది వేరే కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. ఛాతీ నొప్పి వల్ల చాలామంది భయపడుతారు. ఎందుకంటే ఇది గుండెపోటు ప్రధాన లక్షణం. అయితే అది డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకున్న తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఛాతినొప్పి వస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. పొడి దగ్గు
పొడి దగ్గు ఛాతీ కండరాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా కండరాలు బలహీనంగా మారుతాయి. దగ్గు త్వరగా నయం కాకపోతే నొప్పి విపరీతంగా పెరుగుతుంది. ఇటువంటి సమయంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
2. పల్మనరీ ఎంబాలిజం
పల్మనరీ ఎంబాలిజం అనేది ఛాతీ నొప్పికి కారణమయ్యే ఒక వైద్య పరిస్థితి. ఇది ఊపిరితిత్తులకు రక్తాన్ని రవాణా చేసే ధమనులలో కొవ్వు గడ్డలు ఏర్పడటం వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఛాతీ నొప్పి ప్రారంభమవుతుంది.
3. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్
కరోనా సమయంలో చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. దీని కారణంగా ఛాతీ నొప్పి సమస్య వస్తుంది. ఊపిరితిత్తులలో ఏదైనా ఇతర వైరస్ దాడి ఉంటే ఛాతీ నొప్పి సమస్య ఏర్పడుతుందని గుర్తుంచుకోండి.
4. న్యుమోనియా
కరోనా వైరస్ వల్ల చాలామంది రోగులు ఛాతీ నొప్పి కారణంగా న్యుమోనియా బారిన పడ్డారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉంటే న్యుమోనియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది వాపునకు కారణమవుతుంది. ఊపిరితిత్తుల గాలి సంచులు వాచిపోయి ఛాతీ నొప్పి వస్తుంది.