Health Tips: ఐస్‌క్రీం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఇక మీ పని అయిపోయినట్లే..!
Health Tips: ఐస్‌క్రీం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఇక మీ పని అయిపోయినట్లే..!
Health Tips: వేసవికాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఐస్‌క్రీంని ఇష్టపడుతారు. అయితే దీనిని తిన్నవెంటనే దాహం వేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. చాలా మందికి దీనిపై అవగాహన లేదు. వాస్తవానికి ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లు ఎప్పుడు తాగకూడదు. దీనివల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. అయితే ఎంత సమయానికి నీళ్లు తాగాలో ఈరోజు తెలుసుకుందాం.
ఐస్‌క్రీం తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుందని, వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటారు. కానీ వెంటనే దాహం వేస్తోంది. ఇది అందరిలోను జరుగుతుంది. అయితే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఎంత దాహం వేసినా నీళ్లు తాగకూడదని గుర్తుంచుకోండి. దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఒక పరిశోధన ప్రకారం ఐస్ క్రీం చక్కెర, సోడియంతో తయారు చేస్తారు. దీనిని తిన్నప్పుడల్లా ఇవి రెండూ రక్తంలో కలిసిపోతాయి. రక్తం శరీరం మొత్తం వ్యాపించడం ప్రారంభమవుతుంది.
దీని తర్వాత కణాలు నీటిని పూర్తిగా పీల్చడం ప్రారంభిస్తాయి. మన మెదడు ఈ మొత్తం ప్రక్రియను బాగా అర్థం చేసుకుంటుంది. దీనినే హైపోథాలమస్ అంటారు. ఈ దీనివల్ల ఐస్ క్రీం తిన్న వెంటనే దాహం వేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐస్ క్రీం తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల గొంతులో సమస్యలు మొదలవుతాయి. గొంతు నొప్పిగా ఉంటుంది. దంతాలలో సమస్యలు ఎదురవుతాయి. ఐస్‌క్రీం తిన్న15 నిమిషాల తర్వాత నీళ్లు తాగడానికి ప్రయత్నించండి.