Pregnant Women: ప్రెగ్నెన్సీ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ అనర్థాలకి మీరే కారణం..!

Pregnant Women: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీంతో అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు.

Update: 2023-07-19 14:00 GMT

Pregnant Women: ప్రెగ్నెన్సీ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ అనర్థాలకి మీరే కారణం..!

Pregnant Women: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీంతో అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం ఇది కనిపించకుంటే శ్వాస ఆగిపోయినంత పనవుతుంది. అంతలా స్మార్ట్‌ఫోన్‌కి బానిసలుగా మారారు. పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. అయితే ఇందులో గర్భిణులు కూడా ఉన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు స్మార్ట్‌ఫోన్‌లను గంటల తరబడి ఉపయోగిస్తుంటారు. దీనివల్ల తల్లి, పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ హానికరం. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

గర్భిణులు ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లు వాడితే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెన్మార్క్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వేయి మంది గర్భిణిలపై ఒక పరిశోధన జరిగింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వాడే మహిళలకి పుట్టిన పిల్లలు హైపర్యాక్టివిటీ(Hyperactivity), ప్రవర్తనా రుగ్మతల(Behavioral disorders) బాధితులుగా గుర్తించారు.

స్మార్ట్‌ఫోన్ ఎందుకు ప్రమాదకరం?

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడితే వారి జీవనశైలి దెబ్బతింటుంది. నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాలు మారిపోతాయి. దీనివల్ల సరిపడ నిద్ర లభించదు. దీంతో చిన్న విషయాలకే కోపం, చిరాకు, ఆందోళనకు గురవుతారు. ఎక్కువ సేపు ఫోన్‌ని ఉపయోగించడం వల్ల రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. గర్భిణులు ఎదుర్కొనే ఈ సమస్యలన్నీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ వాడే వ్యసనం విపరీతంగా పెరుగుతోంది. ఎటువంటి కారణం లేకుండా గర్భిణులు గంటల తరబడి ఫోన్ వాడుతున్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఫోన్ వినియోగ సమయాన్ని ముందుగానే సెట్ చేసుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి పుస్తకాలు బాగా చదవాలి. రాత్రి పడుకునే ముందు 2 గంటల వరకు ఫోన్ ఉపయోగించవద్దు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అంతేకానీ స్మార్ట్‌ఫోన్‌ జోలికి పోవద్దు. ఈ విషయాలని పాటిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మనిస్తారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News