Kidney Patients: కిడ్నీ పేషెంట్లు ఆల్కహాల్​కి దూరంగా ఉండాలి.. లేదంటే చాలా బాధపడుతారు..!

Kidney Patients: నేటి రోజుల్లో కిడ్నీ రోగులు విపరీతంగా పెరుగుతున్నారు. దీనికి కారణం చెడు అలవాట్లు.

Update: 2023-09-26 14:00 GMT

Kidney Patients: కిడ్నీ పేషెంట్లు ఆల్కహాల్​కి దూరంగా ఉండాలి.. లేదంటే చాలా బాధపడుతారు..!

Kidney patients: నేటి రోజుల్లో కిడ్నీ రోగులు విపరీతంగా పెరుగుతున్నారు. దీనికి కారణం చెడు అలవాట్లు. ముఖ్యంగా ఆల్కహాల్​ తీసుకునేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఒకసారి కిడ్నీ సమస్యలు వచ్చిన తర్వాత ఆల్కహాల్​ తీసుకుంటే వారు జీవితంలో కోలుకోలేరు. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీలు శరీరంలోని మురికిని ఫిల్టర్ చేస్తాయి. కానీ కొందరు వ్యక్తులు అధిక ఆల్కహాల్ తీసుకుంటు కిడ్నీలను నాశనం చేసుకుంటున్నారు. ఆల్కహాల్ కిడ్నీలను ఎలా దెబ్బతీస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

కిడ్నీ రోగులకు ఆల్కహాల్ మంచిది కాదు

కిడ్నీ రోగులు ఆల్కహాల్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది కిడ్నీలను మరింత దెబ్బతీస్తుంది. వాటి పని తీరును కష్టతరం చేస్తుంది. వ్యాధి నయమవుతుందనే ఆశ కూడా ఉండదు.

అంతేకాదు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే కిడ్నీ పేషెంట్లు వీలైనంత త్వరగా ఆల్కహాల్ మానేయడానికి ప్రయత్నించాలి. ఈ పని ఎంత కష్టంగా అనిపించినా నియంత్రించకపోతే కిడ్నీలు పెయిల్​ అవుతాయి. దీనివల్ల ప్రతిసారి డయాలసిస్​ చేయించుకోవాల్సి అవసరం ఏర్పడుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఆల్కహాల్ హాని

ఆల్కహాల్​ శరీరానికి అన్ని విధాలా హాని చేస్తుంది. దీనివల్ల శరీరానికి చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ఇతర వ్యాధులకు తీసుకున్న మందులను కూడా పనిచేయకుండా చేస్తుంది. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకుండా ఉండాలి. లేదంటే రోజులు లెక్కబెట్టుకుంటు బ్రతకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. తరచుగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల ఆరోగ్యకరమైన పానీయాలను తాగాలి. బీట్‌రూట్ రసం, నిమ్మరసం, అల్లం రసం, కొబ్బరి నీరు, పుదీనా నీరు వంటివి తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీలు క్లీన్​ అవుతాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. 

Tags:    

Similar News