Supermarket: సూపర్ మార్కెట్‌ వెళుతున్నారా.. ఇవి గమనించకుంటే ఆరోగ్యానికి నష్టమే..!

Supermarket: ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి వ్యాపారమైంది. తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్నికల్తీ చేస్తున్నారు.

Update: 2023-10-07 15:00 GMT

Supermarket: సూపర్ మార్కెట్‌ వెళుతున్నారా.. ఇవి గమనించకుంటే ఆరోగ్యానికి నష్టమే..!

Supermarket:ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి వ్యాపారమైంది. తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్నికల్తీ చేస్తున్నారు. అందుకే మార్కెట్లో ఏదైనా కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నేటి ఇంటర్నెట‌్ యుగంలో సూపర్ మార్కెట్లు, డీమార్ట‌్ ల హవా నడుస్తోంది. ధరలు తక్కువగా ఉండటంతో చాలామంది ఎక్కువ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిపై ఉండే వివరాలను చెక్ చేయడం లేదు. దీనివల్ల అందులో ఏయే పదార్థాలు కలుస్తున్నాయో తెలియడం లేదు. ఇది భవిష్యత్ లో పలు రోగాలకు కారణమవుతుంది. 

మార్కెట్ లో ఆహార పదార్థాలను కొనేటప్పుడు చెక్ చేసి తీసుకోవాలి. చాలా వరకు కంపెనీలు ఫుడ్ ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమైనవిగా చూపిస్తుంటాయి. నిజానికి వారు చెప్పిన వివరాలు అందులో ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ అధిక ఫైబర్ కలిగి ఉన్నాయని ప్రచారం చేస్తే.. మరికొన్ని ఒమేగా 3 ఉందని జనాలని నమ్మిస్తాయి. అంతేకాదు అధిక రేట్లు పెట్టి లేనివి ఉన్నట్లుగా చూపించి భ్రమ కల్పిస్తాయి. తక్కువ చక్కెర, ఉప్పు, కొవ్వు , క్యాలరీ వివరాలు రేపర్ వెనుక భాగంలో ప్రింట్ అయి ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ బజ్రా, క్వినోవా, ఓట్స్ వంటి ఫ్యాన్సీ పేర్లను ప్రింట్ చేస్తాయి కానీ ప్రోడక్ట్స్ లో ఇవి ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేవి లేబులింగ్‌పై చెక్ చేయవచ్చు.

కొన్నిసార్లు డార్క్ చాక్లెట్ గుండెకు మంచిదని చెబుతారు. కొన్నిసార్లు సోయా మిల్క్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని చెబుతారు. కానీ ఇలాంటివి ఏవి నమ్మకూడదు. కచ్చితంగా ప్యాకెట‌్ లేబుల్ పై ఏవి ఎంత పరిమాణంలో ఉన్నాయో చెక్ చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. ఇలాంటి విషయాలను గమనించకుంటే ధీర్ఘకాలంలో చాలా వ్యాధులకు గురికావాల్సి వస్తోంది. ఈసారి ఏదైనా బిస్కెట్, బ్రెడ్, షుగర్‌లెస్ డ్రింక్ లేదా వంట నూనెను కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా దాని లేబులింగ్‌ని చెక్ చేయండి. లేదంటే ఓట్స్ పేరుతో వట్టి పిండిని తింటారు. అది కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బులు చెల్లించి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటారు.

Tags:    

Similar News