Eye Flu: తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న 'ఐ ఫ్లూ' కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Eye Flu: వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. యువత, చిన్నారులు ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు.

Update: 2023-08-03 14:30 GMT

Eye Flu: తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న 'ఐ ఫ్లూ' కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Eye Flu: వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. యువత, చిన్నారులు ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. వాస్తవానికి ఈ సీజన్‌లో ఈ వ్యాధి సాధారణమే కానీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నందున ఇది సులభంగా వ్యాపిస్తోంది. కళ్లలో మంట, కళ్ల వాపు, నీరు కారడం, నొప్పితో కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కండ్ల కలక వచ్చినట్లు అర్థం చేసుకోవాలి.

ఈ సమయంలో ఒంటరిగా ఉండాలి. కళ్లను శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక క్లాత్‌ని వాడాలి. వీలైనంత వరకు ఇతర వ్యక్తులకి దూరంగా ఉండాలి. 3 రోజుల తర్వాత తగ్గకుంటే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. అవగాహన, జాగ్రత్తతో ఈ ఇన్‌ఫెక్షన్‌ని 3 నుంచి 4 రోజుల్లో నియంత్రించవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు సులభంగా ఇన్‌ఫెక్షన్‌కి గురవుతాయి. అందుకే మొదటి 3 రోజులు ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఉండాలి. పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం.

కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో పుసి ఏర్పడడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా ఇవి రెండు వారాలలో వాటంతట అవే పూర్తిగా తగ్గిపోతాయి. నీళ్లు కాచి, చల్లార్చి కాస్త దూదిని ఆ నీటిలో ముంచి కళ్లను వీలైనంత నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి.

చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శభ్రమైన, ఉతికిన టవల్స్ లేదా కర్చీఫ్‌లు మాత్రమే వాడాలి. కళ్లకలకలు చాలా త్వరగా వ్యాపిస్తాయి కనుక తగ్గేవరకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిది. కళ్లల్లో విపరీతమైన నొప్పి, దురద, బాగా ఎరుపెక్కి మంట ఎక్కువవుతుందంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News