Natural Immunity: సహజసిద్దమైన రోగనిరోధక శక్తి కోసం ఇలా చేయండి.. జలుబు, జ్వరం అస్సలు ఉండదు..!
Natural Immunity: వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు తొందరగా ప్రబలుతాయి.
Natural Immunity: వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు తొందరగా ప్రబలుతాయి. ఈ కాలంలో వైరస్‌లు, బాక్టీరియా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. వీటివల్ల అనేక ఇన్‌ఫెక్షన్‌లు, అంటువ్యాధులు సోకుతాయి. అందుకే ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. లేదంటే జలుబు, దగ్గు, జ్వరాలకి గురికావాల్సి ఉంటుంది. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. సీజనల్ వ్యాధులని నివారించాలంటే సహజసిద్దంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని పద్దతులు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ప్రశాంతమైన నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర సమయంలో రోగనిరోధక వ్యవస్థ సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థ కణాల అభివృద్ధికి తోడ్పడుతాయి. శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు సైటోకిన్‌లు ఎక్కువగా అవసరమవుతాయి. అందుకే 7 నుంచి 8 గంటల నిద్ర పొందకపోతే తగినంత సైటోకిన్‌లు ఉత్పత్తి కావు. అందుకే ప్రతి ఒక్కరు మంచి నిద్రపోవాలి.
శరీరానికి సరిపడ నీరు
రక్తాన్ని పంపింగ్ చేయడానికి వాటర్ చాలా అవసరం. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి, శరీరం మొత్తం పోషకాలను రవాణా చేయడానికి నీరు సహాయపడుతుంది. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగితే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. సహజసిద్దంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
పోషకాహారం
రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే విటమిన్ సి, విటమిన్ డి, జింక్ అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి పొందాలి. రోజువారీ ఆహారంలో ఆరెంజ్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, టొమాటో, బ్రొకోలీ, రెడ్ మీట్ తీసుకోవాలి. ఇది కాకుండా డైటీషియన్ సహాయంతో సమతుల్య ఆహారం జాబితాను తయారు చేసి పాటించాలి. అప్పుడే శరీరంలో సహజసిద్దంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.