Collagen Superfoods: ముఖంపై ముడతల సమస్యా.. ఈ ఫుడ్స్ తింటూ కొల్లాజెన్ పెంచుకోండి..!
Collagen Superfoods: వయసు పెరిగే కొద్దీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది.
Collagen Superfoods: ఈరోజుల్లో చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే అయితే ఆరోగ్యకరమైన ఆహారం చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. కొల్లాజెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని కారణంగా చర్మంపై ముడతలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తి కోసం మార్కెట్లో అనేక సప్లిమెంట్లు వచ్చాయి. కానీ ఇది సరైన మార్గం కాదు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నిరకాల శ్రేయస్కరం. అలాంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
గుడ్డు తెల్లసొన
గుడ్డులోని తెల్లసొనలో ప్రోలిన్ ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన వాటిలో ఇది ఒకటి. అందుకే గుడ్డులోని తెల్లసొన భాగాన్ని తినాలి. అల్పాహారంలో గుడ్డులోని తెల్ల భాగాన్ని చేర్చుకోవచ్చు.
బెర్రీలు
బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. అనేక విధాలుగా బెర్రీలు తినవచ్చు. స్మూతీస్, సలాడ్‌లలో బెర్రీలను చేర్చకోవచ్చు.
ఆకు కూరలు
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి పనిచేస్తుంది.
బీన్స్
బీన్స్‌లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి పని చేస్తాయి.
టొమాటో
టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో లైకోపీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. కొల్లాజెన్ ఉత్పత్తి కోసం టమోటాలు తీసుకోవచ్చు.
సిట్రస్ జాతి పండ్లు
మీరు సిట్రస్ పండ్లను తినవచ్చు. వీటిలో విటమిన్ సి ఉంటుంది. ద్రాక్షపండు, నారింజ, నిమ్మకాయలు వంటి పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. ఈ పుల్లని పండ్లను ఆరోగ్యకరమైన పానీయాలు, సలాడ్‌లుగా కూడా తీసుకోవచ్చు.