Health Tips:ఈ మసాల దినుసులు ఆహారంలో చేర్చండి.. జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టండి..!

Health Tips:ఈ మసాల దినుసులు ఆహారంలో చేర్చండి.. జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టండి..!

Update: 2023-01-13 14:30 GMT

Health Tips:ఈ మసాల దినుసులు ఆహారంలో చేర్చండి.. జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టండి..!

Health Tips: జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల శరీరం మొత్తం కలత చెందుతుంది. తరచుగా కడుపు నొప్పి వస్తుంది. అయితే మనం ఆహారంలో ఉపయోగించే మసాలాలు ఈ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకు ఎటువంటి మసాలాలు ఉపయోగపడతాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఇంగువ:

ఇంగువ ఆహారాన్ని సుగంధంగా, రుచికరంగా చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఆహారంలో ఇంగువని ఉపయోగిస్తే అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. వేడి నీళ్లలో ఇంగువ కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

జీలకర్ర:

జీలకర్ర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణ సమస్యలు దూరం కావాలంటే జీలకర్రను వేయించి పొడి చేసి తీసుకోవాలి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క ఆహారం రుచిని పెంచడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. దీన్ని నీటిలో మరిగించిన తాగితే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

యాలకులు:

ఏలకుల కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏలకులు తినడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఆహారం బాగా జీర్ణమవుతుంది.

సోంపు:

సోంపుని కూడా వంటలలో ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. సోంపును నీటిలో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

Tags:    

Similar News