Fasting Diet: ఉపవాసం ఉన్నప్పుడు డైట్‌లో వీటిని చేర్చండి.. రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు..!
Fasting Diet: ఇష్టమైన దేవుడి కోసం చాలామంది వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. ఇలాంటి సమయంలో సరైన డైట్ పాటించాలి.
Fasting Diet: ఇష్టమైన దేవుడి కోసం చాలామంది వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. ఇలాంటి సమయంలో సరైన డైట్ పాటించాలి. అప్పుడే రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహార, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
ఖర్జూరం
ఉపవాస సమయంలో ఖర్జూరం తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుతుంది. ఉపవాసం సమయంలో కచ్చితంగా ఖర్జూరాన్ని తినాలి.
గింజలు
ఉపవాస సమయంలో గింజలు తినడం శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వీటివల్ల శరీరానికి చాలా శక్తి లభిస్తుంది. ఇవి సరైన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటివి తీసుకుంటే మంచిది.
తాజా పండ్లు
ఉపవాస సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అందుకే తాజా పండ్లను తప్పనిసరిగా తినాలి.
పెరుగు
ఉపవాస సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఉపవాస సమయంలో పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.