Cancer: క్యాన్సర్ వచ్చేముందు ఈ సంకేతాలని ఇస్తుంది.. విస్మరిస్తే ప్రాణాలకే ప్రమాదం..!
Cancer: క్యాన్సర్ లక్షణాలని ముందుగానే గుర్తించినట్లయితే వ్యాధి తీవ్రత పెరగకముందు చికిత్స ప్రారంభించవచ్చు.
Cancer: క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. అయితే క్యాన్సర్ వచ్చేముందు శరీరం కొన్ని రకాల సంకేతాలని ఇస్తుంది. వీటిని విస్మరించినట్లయితే చాలా ప్రమాదం జరుగుతుంది. క్యాన్సర్ లక్షణాలని ముందుగానే గుర్తించినట్లయితే వ్యాధి తీవ్రత పెరగకముందు చికిత్స ప్రారంభించవచ్చు. అయితే శరీరం ఎలాంటి సంకేతాలు అందిస్తుందో ఈరోజు తెలుసుకుందాం.
అన్ని వేళలా అలసట
సరైన ఆహారం తీసుకొని కంటినిండ నిద్రపోయినప్పటికీ కొంతమంది అలసటగా ఉంటారు. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అలసట అనేది తీవ్రమైన వ్యాధి లక్షణం అవుతుంది.
శరీర నొప్పి
శరీరం చాలా కాలంగా నొప్పిని కలిగి ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఒక పెద్ద వ్యాధికి సంకేతం అవుతుంది. అందువల్ల శరీరంలో నొప్పి లేదా అసౌకర్యం ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ఆకస్మిక బరువు తగ్గడం
వేగంగా బరువు తగ్గడం తీవ్రమైన సమస్యకు కారణం అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్‌లో ప్రజల శరీర బరువు వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇలా జరిగినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
చర్మంలో మార్పులు
చర్మంలో మార్పులు రావడం క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఇందులో వ్యక్తి చర్మం రంగు మారుతుంది. విపరీతమైన దురద, రక్తస్రావం, దద్దుర్లు సమస్య ఏర్పడుతుంది. చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడి దగ్గరకి వెళ్లాలని గుర్తుంచుకోండి.