Health Tips: ఈ మసాలాలు బరువు తగ్గిస్తాయి.. బెల్లీఫ్యాట్‌ని కరిగిస్తాయి..!
Health Tips: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Health Tips: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు. అయితే డైట్‌లో మార్పులు చేయడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. కొన్ని మసాలాలు వాడటం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. వీటిలో ఆయుర్వేద గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
1.జీలకర్ర
జీలకర్రను కూరలలో వినియోగించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. ఈ మసాలా తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీలో మార్పులు మొదలవుతాయి. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ సహాయంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. బరువు తగ్గాలంటే జీలకర్ర నీరు కూడా తాగవచ్చు. పెరుగు లేదా మజ్జిగలో జీలకర్ర పొడి కలిపి తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
2. పసుపు
వంటకాల్లో పసుపు వాడటం వల్ల రుచి పెరగడమే కాకుండా మంచి రంగు వస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. అంతేకాకుండా అనేక విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. ఈ మసాలా సహాయంతో జీవక్రియను నియంత్రించవచ్చు. ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతిరోజు పసుపు పాలు తాగాలి.
3. నల్ల మిరియాలు
నల్ల మిరియాలు తినడం వల్ల కొవ్వు కణాలు ఏర్పడే ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోదు. అంతేకాదు మీరు బ్లాక్ పెప్పర్ టీ కూడా తాగవచ్చు. అలాగే వీటి పొడిని సలాడ్ లేదా ఉడికించిన గుడ్లలో చల్లి తీసుకోవచ్చు.
4. దాల్చిన చెక్క
దాల్చిన చెక్క పొట్ట, నడుము చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. ఇది చక్కెరను కొవ్వుగా మార్చడాన్ని నిరోధిస్తుంది. తద్వారా బెల్లీఫ్యాట్ ఏర్పడదు. దీని కోసం దాల్చినచెక్క, తక్కువ కొవ్వు పాలను మిక్స్ చేసి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.