Health Tips: ఈ ఆహారాలు తింటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది.. ఈ రోజే వదిలేయండి..!

Health Tips: గుండె సంబంధిత వ్యాధులకు చెడు కొలెస్ట్రాల్ అతిపెద్ద కారణం.

Update: 2023-01-24 10:03 GMT

Health Tips: ఈ ఆహారాలు తింటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది.. ఈ రోజే వదిలేయండి..!

Health Tips: గుండె సంబంధిత వ్యాధులకు చెడు కొలెస్ట్రాల్ అతిపెద్ద కారణం. ఇది రక్తనాళాలలో పేరుకుపోయి గుండెకి రక్త సరఫరా చేయడంలో ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. దీని కారణంగా స్టెంట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. వాటికి దూరంగా ఉంటే మంచిది. అధిక కొలెస్ట్రాల్‌ను పెంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

వెన్న

ఈ రోజుల్లో అన్నీ వెన్నతో తినడం ట్రెండ్‌గా మారింది. వెన్న కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని కారణంగా సిరల్లో మైనపులాంటి పదార్థం పెరుగుతుంది. వెన్నలో కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటుకు కారణం కావచ్చు. ఈ రోజునుంచే దీన్ని తినడం మానుకోండి.

వేయించిన ఆహారం

డీప్ ఫ్రైడ్ ఫుడ్ కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతుంది. ఇది గుండె ఆగిపోవడానికి కారణం అవుతుంది. గుండెపోటు, స్టెంట్ సర్జరీ వంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆయిల్, స్పైసీ వంటి వాటిని తినడం మానేయాలి.

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్ గుండెకు హానికరం. పిజ్జా, బర్గర్ తయారీలో కృత్రిమ పదార్థాలని వాడుతారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి తినడం మానేయాలి.

బిస్కెట్, టోస్ట్

చాలా మంది ఉదయం టీతో బిస్కెట్లు లేదా టోస్ట్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె జబ్బులకు కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే బిస్కెట్లు వంటి వాటిని తినడం మానేయాలి.

ఐస్ క్రీం

ప్రజలు రుచిగా ఉందని ఐస్‌క్రీమ్‌ ఎక్కువగా తింటారు. కానీ ఇది గుండెకు చాలా ప్రాణాంతకం. ఐస్ క్రీం తినడం వల్ల కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది.

Tags:    

Similar News