Chocolate: చాక్లెట్‌ తింటే బ్రెయిన్‌ షార్ప్‌.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Chocolate: చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Update: 2023-06-03 00:30 GMT

Chocolate: చాక్లెట్‌ తింటే బ్రెయిన్‌ షార్ప్‌.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Chocolate: చాక్లెట్‌ అంటే అందరికి ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తింటారు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. కానీ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు ఇందులో ఉండే సమ్మేళనాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయని నిరూపణ అయింది. చాక్లెట్‌లో ఫ్లేవనాల్ ఉంటుంది. ఇది బ్రెయిన్‌ని షార్ప్‌ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

హార్వర్డ్, కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు ప్రతిరోజూ 500 మిల్లీగ్రాముల ఫ్లేవనోల్స్‌ను సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుందని కనుగొన్నారు. వారి అభిప్రాయం ప్రకారం జ్ఞాపకశక్తికి ఫ్లేవనాయిడ్లు అవసరమని తెలిపారు. ఒక కప్పు టీ, డార్క్ చాక్లెట్, యాపిల్స్ 500 mg ఫ్లేవనాయిడ్‌లను అందిస్తాయి. అందువల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

3,500 మందిపై ఒక పరిశోధన చేశారు. ఈ వ్యక్తుల వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. వీరికి ఫ్లేవనోల్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను అందించారు. మూడు సంవత్సరాల వ్యవధిలో జ్ఞాపకశక్తి పరీక్షలను పెట్టారు. సర్వేలో ఫ్లేవనాల్ మాత్రను తీసుకున్న వ్యక్తుల జ్ఞాపకశక్తి స్కోర్లు మెరుగుపడ్డాయి. డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి పోషకాలు అందుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మూడ్‌ని మారుస్తుంది.

Tags:    

Similar News