డెంగ్యూ, వైరల్ ఫీవర్ మధ్య తేడా తెలియకుంటే ప్రమాదంలో పడినట్లే..!

Dengue Fever Vs Viral Fever: దేశంలో డెంగ్యూ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Update: 2022-11-10 13:45 GMT

డెంగ్యూ, వైరల్ ఫీవర్ మధ్య తేడా తెలియకుంటే ప్రమాదంలో పడినట్లే..!

Dengue Fever Vs Viral Fever: దేశంలో డెంగ్యూ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అలాగే శీతాకాలంలో వైరల్‌ ఫీవర్‌ ఎఫెక్ట్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే వాస్తవానికి డెంగ్యూ, వైరల్ జ్వరం లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. దీని కారణంగా ప్రజలు వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది. డెంగ్యూ వ్యాధిగ్రస్తుల లక్షణాలను సరైన సమయంలో గుర్తించకపోతే వారు సకాలంలో చికిత్స పొందలేరు. దీంతో అది ప్రాణాంతకం కావచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రెండు జ్వరాల లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు డెంగ్యూ, వైరల్ జ్వరాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

డెంగ్యూ, వైరల్ ఫీవర్ కారణాలు

వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వైరల్ ఫీవర్ వస్తుంది. దీని వల్ల జలుబు, జ్వరం వస్తుంటాయి. వాతావరణంలో మార్పుల కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు దీని బారిన పడతారు. వైరల్ ఫీవర్ 5 నుంచి 7 రోజులలో నయమవుతుంది. అయితే ఒకరకమైన దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. దీని లక్షణాలు కొద్ది రోజుల్లోనే కనిపిస్తాయి. డెంగ్యూ వ్యాధికి సరైన చికిత్స అందకపోతే ప్రాణాంతకం కావచ్చు. కాలేయంపై దాని ప్రభావం కనిపిస్తుంది.

డెంగ్యూ, వైరల్ ఫీవర్ మధ్య వ్యత్యాసం

1. డెంగ్యూలో చాలా ఎక్కువ జ్వరం ఉంటుంది. దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అయితే వైరల్ జ్వరం అధిక జ్వరాన్ని కలిగించదు.

2. డెంగ్యూలో రోగుల చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. అయితే వైరల్ జ్వరంలో ఇది జరగదు.

3. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పడిపోతుంది. అయితే వైరల్ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్‌పై ప్రభావం ఉండదు.

4. డెంగ్యూ కారణంగా తక్కువ రక్తపోటు సమస్య ఉంటుంది. అయితే వైరల్ జ్వరంలో ఇది జరగదు.

5. డెంగ్యూ వాంతులు, కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే వైరల్ జ్వరంలో అలాంటి సమస్య ఉండదు.

ఇద్దరికీ చికిత్స ఏంటి..

ఏ రకమైన జ్వరం వచ్చినా రోగి రక్త పరీక్ష చేయించుకోవాలి. వెంటనే వైద్యుడికి చూపించాలి. పారాసెటమాల్ మందులు రెండు పరిస్థితులలో ఇస్తారు. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స అందిస్తే వారం రోజుల్లో సులభంగా కోలుకోవచ్చు. వైరల్ జ్వరం నుంచి కోలుకోవడానికి 5 నుంచి 7 రోజులు పడుతుంది.

Tags:    

Similar News