Wake Up Looking Phone: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా.. పెద్ద తప్పు చేస్తున్నారు జాగ్రత్త..!
Wake Up Looking Phone: చాలామంది ఉదయం నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చూస్తారు. మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటూ చాలాసేపు బెడ్‌పైనే గడుపుతారు.
Wake Up Looking Phone: చాలామంది ఉదయం నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చూస్తారు. మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటూ చాలాసేపు బెడ్‌పైనే గడుపుతారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. వాస్తవానికి ఉదయం నిద్రలేవగానే చేసే పనులు చాలా ఉంటాయి. వాటిని కాదని ఫోన్‌తో గడపడం ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం, యోగా చేసే సమయంలో ఫోన్‌తో గడపడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఉదయం నిద్రలేచిన వెంటనే మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్‌డేట్లు చూడటం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. ఇది ప్రశాంతమైన జీవనశైలికి అంతరాయం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ రోజు మొత్తం ఉంటుందని, శరీరం, మనస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. స్వీడన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. మొబైల్ ఫోన్‌ల వినియోగం వల్ల యువతలో నిద్రలేమి, డిప్రెషన్ ప్రభావం నేరుగా పడుతుందని తేలింది.
ఉదయాన్నే ఫోన్‌లో వివిధ సమాచారం కోసం వెతకడం, వాట్సప్‌లో మెసేజ్‌లు చెక్ చేయడం వల్ల మెదడు సామర్థ్యం తగుతుందని అంటున్నారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా, కంటి ఆరోగ్యంపై పడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాదు మనిషిలో చురుకుదనం లోపిస్తుందని, స్మార్ట్ ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల నెక్ సిండ్రోమ్, కంటి చూపు సమస్యలు, అధిక బరువు తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది.