Anti Mosquito Plants: ఇంటి చుట్టుపక్కల దోమలు ఉండొద్దంటే ఈ మొక్కలు నాటండి.. అవేంటంటే..?
Anti Mosquito Plants: నేటి రోజుల్లో వాతావరణం కలుషితం కావడంతో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది.
Anti Mosquito Plants: నేటి రోజుల్లో వాతావరణం కలుషితం కావడంతో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది. రాత్రిపూట మాత్రమే కాదు పగటిపూట కూడా కుడుతున్నాయి. దోమల నివారణకు వెలిగించిన కాయిల్స్, అగరబత్తీలు ఎటువంటి ప్రభావం చూపడం లేదు. దీంతో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. మీరు దోమల సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే ఇంటి చుట్టుపక్కల కొన్ని ఆయుర్వేద మొక్కలు నాటండి. వీటివల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఆ మొక్కల గురించి తెలుసుకుందాం.
లావెండర్
ఆయుర్వేద నిపుణుల ప్రకారం లావెండర్ మొక్క నాటడం వల్ల ఇంట్లో సువాసన ఉంటుంది. కానీ దోమలు ఈ వాసనని ఇష్టపడవు. అవి దీనికి దూరంగా ఉంటాయి. లావెండర్ మొక్క ఉంటే దోమలు ఇంట్లోకి రావడానికి ఇష్టపడవు.
పుదీనా
పుదీన మొక్క క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. ఇది దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. దీని వాసన వల్ల ఇంటి చుట్టుపక్కలకి దోమలు రావు. పుదీన ఆకులని తీసి అక్కడక్కడ వేయాలి. తద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
రోజ్మేరీ
ఇంటి అందాన్ని పెంచడానికి ఈ మొక్కని నాటుతారు. ఇది అలంకరణకి మాత్రమే కాకుండా దోమలు రాకుండా కూడా చేస్తుంది. వాస్తవానికి దోమలు ఈ మొక్కనుంచి వెలువడే వాసనని తట్టుకోలేవు. అవి వెంటనే పారిపోతాయి.
తులసి మొక్క
భారతీయ సంస్కృతిలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. కోట్లాది మంది ప్రజలు ఉదయంపూట తులసి పూజ చేయడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. తులసి పవిత్రమైనది మాత్రమే కాదు ఔషధ మొక్క కూడా. తులసి మొక్క నుంచి వెలువడే వాసనకి దోమలు దూరంగా ఉంటాయి. ఇంట్లోకి రాడానికి సాహసించవు.