Black Salt: నల్ల ఉప్పు వాడితే ఈ ఆరోగ్య సమస్యలు దూరం.. శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Black Salt: ఉప్పు శరీరానికి అవసరమే కానీ అతిగా వాడితే అనర్థాలు జరుగుతాయి. ఉప్పులో రెండు రకాలు ఉంటాయి.

Update: 2023-07-21 13:00 GMT

Black Salt: నల్ల ఉప్పు వాడితే ఈ ఆరోగ్య సమస్యలు దూరం.. శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Black Salt: ఉప్పు శరీరానికి అవసరమే కానీ అతిగా వాడితే అనర్థాలు జరుగుతాయి. ఉప్పులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైట్‌ రెండోది బ్లాక్‌. ఇవి ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండటం మనం గమనించవచ్చు. అయితే నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఎక్కువ ప్రజలు తెల్ల ఉప్పును తీసుకుంటారు. బ్లాక్ సాల్ట్‌లో అనేక యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. బ్లాక్ సాల్ట్ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

అసిడిటీ దూరం

నల్ల ఉప్పు పొట్టకు చాలా మంచిది. ఇందులో కాలేయానికి మేలు చేసే అంశాలు ఉంటాయి. మలబద్ధకం లేదా అసిడిటీ సమస్య ఉన్నవారు బ్లాక్ సాల్ట్ వాడాలి. దీంతో పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

గుండె ఆరోగ్యం

నల్ల ఉప్పు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే నల్ల ఉప్పుని వాడాలి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. తెల్ల ఉప్పు మానేసి ప్రతిరోజు నల్ల ఉప్పు వాడితే మంచి ఫలితాలని గమనించవచ్చు.

మధుమేహం

డయాబెటిస్ ఉన్నట్లయితే బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్‌లో ఉంచుతుంది. నిత్యజీవితంలో బ్లాక్ సాల్ట్‌ని వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

ఆహారం సులభంగా జీర్ణం

నల్ల ఉప్పు తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో ఉదర సమస్యలు దరిచేరవు. నిత్యం ఆరోగ్యంగా ఉంటారు.

చర్మ సమస్యలు తగ్గుతాయి

నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితం ఉంటుంది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిదని సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు.

బరువు తగ్గుతారు

నల్ల ఉప్పు శరీర బరువును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కొద్దిగా నల్ల ఉప్పు వేసి పరగడుపున తాగితే బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.

Tags:    

Similar News