Cancer Effect: మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉందా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Cancer Effect: వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మకమైన విజయాలు సాధించినా క్యాన్సర్‌కు సరైన చికిత్స లేదనే చెప్పాలి.

Update: 2023-11-05 14:30 GMT

Cancer Effect: మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉందా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Cancer Effect: వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మకమైన విజయాలు సాధించినా క్యాన్సర్‌కు సరైన చికిత్స లేదనే చెప్పాలి.ఇది డాక్టర్లు కూడా ఒప్పుకునే పచ్చి నిజం. క్యాన్సర్ అనే పేరు ఎవరికైనా పీడకల లాంటిది. దీనిని సకాలంలో గుర్తించినట్లయితే రోగికి చికిత్స సులభం అవుతుంది. అతని ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది అంత తొందరగా బయటపడదు. రోగిని రక్షించడం చాలా కష్టం అవుతుంది. చెడు జీవనశైలి నుంచి మద్యపానం, ధూమపానం, రేడియేషన్ వల్ల క్యాన్సర్‌ సంభవించడం ఒకవైపు అయితే మరోవైపు వారసత్వం వల్ల కూడా క్యాన్సర్‌ వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే (తల్లిదండ్రులు లేదా తాతలకు క్యాన్సర్ ఉంటే), అది మరిన్ని తరాల వరకు కొనసాగుతోంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు క్యాన్సర్ వస్తే తరువాత వచ్చే వ్యక్తుల్లో ఈ ప్రమాదం పెరుగుతుంది. మొదటి తరంలో అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు వస్తుంది. అందువల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని సకాలంలో నిరోధించడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం.

జన్యు పరీక్ష చేయించుకోవాలి

జన్యు పరీక్ష అనేది జన్యువులను పరిశీలించే ఒక టెక్నాలజీ. ఈ పరీక్ష ద్వారా భవిష్యత్‌లో ఏదైనా వ్యాధికి కారణమయ్యే జన్యువులో ఏదైనా మార్పు ఉందా లేదా అని తెలుస్తుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉంటే ముందు జాగ్రత్త చర్యగా ఈ పరీక్ష చేయించుకోవాలి.

ఈ విషయాలపై శ్రద్ధ అవసరం

కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అదే క్యాన్సర్‌ మీకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి రకమైన క్యాన్సర్ వంశపారంపర్యంగా ఉండదు. అండాశయ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ జన్యుపరమైనవి కావచ్చు. అదే సమయంలోశరీరంలో అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఎముకలలో నొప్పి, దగ్గు లేదా నోటి నుంచి రక్తస్రావం, ఎక్కువసేపు జ్వరం వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

ఆహారం పట్ల శ్రద్ధ

క్యాన్సర్‌ను నివారించడానికి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. స్మోకింగ్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరం పాటించండి. దీనివల్ల క్యాన్సర్‌ను మాత్రమే కాదు తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు.

ఆరోగ్యకరమైన దినచర్య

ఏదైనా వ్యాధిని నివారించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ శారీరక శ్రమ అంటే వ్యాయామం లేదా యోగా చేయడం అవసరం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడవడం, సైకిల్ తొక్కడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

Tags:    

Similar News