Mangoes Identify: సీజన్‌కి ముందే మామిడిపండ్లని కొంటున్నారా.. జాగ్రత్త ఆస్పత్రి బిల్లు చెల్లించాల్సిందే..!

Mangoes Identify: మామిడిపండ్లంటే ఇష్టపడేవారు వేసవి కాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Update: 2023-03-14 14:18 GMT

Mangoes Identify: సీజన్‌కి ముందే మామిడిపండ్లని కొంటున్నారా.. జాగ్రత్త ఆస్పత్రి బిల్లు చెల్లించాల్సిందే..!

Mangoes Identify: మామిడిపండ్లంటే ఇష్టపడేవారు వేసవి కాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మామిడి సీజన్ పూర్తిగా రాలేదు కానీ మార్కెట్లు, దుకాణాల్లో మామిడిపండ్లు దర్శనమిస్తున్నాయి. అయితే కొంతమంది వాటిని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటిని కెమికల్ లేదా కార్బైడ్ తో పండిస్తారు. సహజసిద్దమైన మామిడిపండ్లని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది వ్యాపారవేత్తలు ఎక్కువ లాభాలను సంపాదించడానికి రసాయనాలు, కార్బైడ్లను ఉపయోగిస్తారు. వీటితో పండించిన మామిడిపండ్లు తింటే శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాబట్టి మామిడిపండ్లని కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి చెట్టునుంచి కోసిన మామిడిని సహజంగా పండించవచ్చు. కానీ దీనికి కొంత సమయం పడుతుంది.

ఇందుకోసం కొంచెం వెచ్చగా ఉండే గదిలో కొంచెం గడ్డివేసి అందులో మామిడిపండ్లని పోసి పైనుంచి గడ్డి కప్పాలి. కొన్ని రోజులకి అవి పక్వానికి వస్తాయి. కానీ అందులో కార్బన్ మోనాక్సైడ్, ఎసిటిలీన్ గ్యాస్ లాంటివి వాడితే అవి ప్రమాదకరంగా మారుతాయి. రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఇందులో చర్మ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మెదడు నష్టం, గర్భాశయ క్యాన్సర్ ఉంటాయి.

రసాయన మామిడిని ఎలా గుర్తించాలి..?

1. మీరు మామిడిని వాసన చూసి గుర్తించవచ్చు. అది కార్బైడ్‌తో పండినట్లయితే అది ఘాటైన వాసన వస్తుంది.

2. కార్బైడ్‌తో పండిన మామిడిపండ్లు తింటే రుచి సరిగ్గా ఉండదు. ఛాతిలో మండినట్లుగా అనిపిస్తుంది.

3. రసాయనాలతో పండించిన మామిడిపండ్లు కొన్ని చోట్ల పసుపు, కొన్ని చోట్ల ఆకుపచ్చగా ఉంటాయి.

4. సహజసిద్ధంగా పండించిన మామిడిపండ్ల రంగు దాదాపు మొత్తం ఒకే విధంగా ఉంటుంది.

5. మామిడిని కోసినట్లయితే సహజసిద్ధంగా పండిన మామిడిపండ్లు పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తాయి.

Tags:    

Similar News