Insulin : షుగర్ పేషంట్లకు శుభవార్త..రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్‎కు గుడ్ బై

Insulin: దేశంలో షుగర్ పేషంట్లు గణనీయంగా పెరుగుతున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి వీళ్లందరూ రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.

Update: 2024-07-04 11:45 GMT

Insulin : షుగర్ పేషంట్లకు శుభవార్త..రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్‎కు ఇక నుంచి గుడ్ బై

Insulin : మనదేశంలో దాదాపు 10కోట్ల మందికి పైగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకునేందుకు వీళ్లంతా ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కరోజు తప్పినా ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఎదురౌతుంది. ఇలాంటి సమయంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు డెన్మార్క్ కు చెందిన ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజు కాకుండా వారానికోసారి ఇచ్చే ఇన్సులిన్ ఐకోడెక్ ను ఈ సంస్థ డెవలప్ చేసింది. ఇప్పటికే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పర్మిషన్ పొందిన ఈ ఇంజెక్షన్..భారత్ లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలనకు వచ్చింది. ఒకవేళ అనుమతులు లభించినట్లయితే త్వరలోనే భారత మార్కెట్లోకి ఐకోడెక్ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా స్థూలకాయులు బరువును తగ్గించడంలో సాయపడే ఒజెంప్టిక్ డ్రగ్ ను కూడా నోవో నోర్డిస్క్ కంపెనీ యారు చేసింది.

సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడంతో వరుసగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లువస్తాయి. దీన్ని నివారించాలంటే షుగర్ లెవల్స్ నియంత్రించే ఇన్సులిన్ రోజూ అవసరం అవుతుంది. అయితే ఐకోడెక్ ద్వారా ఇన్సులిన్ ను వారానికోసారి సరిపడే మోతాదులో ఒకే డోసు ఇంజెక్షన్ గా తీసుకుంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. దీనిపై గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఐకోడెక్ ద్వారా వారానికి సరిపడే విధంగా ఇన్సులిన్ ను ఇచ్చినప్పుడు ఆ ఇన్సులిన్ అంతా రక్తంలోని ఆల్బుమిన్ అనే ప్రొటీన్ లో ఇన్ యాక్టివ్ స్టోరేజీలో ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. రక్తంలో షుగర్ లెవల్స్ మారినప్పుడు ప్రతిరోజూ కొద్ది కొద్దిగా ఇన్సులిన్ వారంపాటు రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News