ICMR Health Tips: ఆరోగ్యానికి ఐసీఎంఆర్ సూచనలివే..!
ICMR Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఏం చేయాలి, దీనికి వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారు?

ICMR Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఏం చేయాలి, దీనికి వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటే ఆరోగ్యంగా ఉంటారనే విషయాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. మారిన కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఐసీఎంఆర్ చేసిన సూచనలు
ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల మంచినీరు తీసుకోవాలి.
సీజనల్ పండ్లు, కూరగాయాలను తినాలి.
పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లను తినాలి.
శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూసుకోవాలి.
అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వులతో కూడిన మాంసం తినాలి.
చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి.
ఆహారంలో ఉప్పు వాడడాన్ని తగ్గించాలి. మీ ఆహారాన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రోజూ ఒకే సమయంలో భోజనం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కువ సేపు కూర్చోవద్దు. కనీసం అరగంటకు ఒకసారి పది అడుగులైనా వేయాలి.
కంప్యూటర్ స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించాలి. 30 నిమిషాలకు కనీసం రెండు నుంచి మూడు నిమిషాలైనా కొంతసేపు కంప్యూటర్ స్క్రీన్ కు దూరంగా ఉండాలి.
ప్రతి రోజూ కొంతసేపు ఎండలో ఉండాలి. సూర్యకాంతితో డి విటమిన్ లభిస్తుంది.
నూనె వాడకాన్ని తగ్గించాలి.
పాలిష్ చేసిన ధాన్యాలకు బదులుగా ముడి ధాన్యాన్ని వాడాలి.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మీరు నివసించే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి.