Vitamin K: ప్రాణాలు కాపాడే విటమిన్‌.. ఇది లేకుంటే బతకడం కష్టం, ఎందులో ఉంటుంది తెలుసా?

Vitamin K Rich Foods: మన శరీరానికి ఏ విటమిన్‌ తగ్గినా ప్రమాదమే. అందుకే పోషకాలు విటమిన్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలని వైద్యులు చెబుతారు. మనం తీసుకునే ఆహారాల్లో విటమిన్‌ కే ఎంతో ముఖ్యం. ఏ ఆహారాల్లో ఉంటుంది తెలుసుకుందాం.

Update: 2025-03-12 16:12 GMT
Vitamin K

Vitamin K: ప్రాణాలు కాపాడే విటమిన్‌.. ఇది లేకుంటే బతకడం కష్టం, ఎందులో ఉంటుంది తెలుసా?

  • whatsapp icon

Vitamin K Rich Foods: మనం తీసుకునే ఆహారాల్లో అనేక విటమిన్స్‌ ఉంటాయి. ఇవి లేకుంటే ఆరోగ్యంగా ఉండటం కష్టం. విటమిన్‌ ఏ, బీ, సీ, డీ, ఇ, కే ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో విధంగా మన శరీరాన్ని కాపాడతాయి. అయితే, రక్తాన్ని గడ్డకట్టేలా చేసే విటమిన్‌ కే గురించి మీకు తెలుసా? ఇది లేకుంటే బతకడం కష్టం. ఇవి సహజసిద్ధంగా ఏ ఆహారాల్లో ఉంటాయి తెలుసుకుందాం.

పాలకూర..

పాలకూరలో విటమిన్‌ కే పుష్కలం. వంద గ్రాముల పాలకూరలో ఒక రోజుకు మన శరీరానికి కావాల్సిన 400 శాతం విటమిన్‌ కే అందిస్తుంది పాలకూర. ఇది ఎముక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాల్షియం గ్రహించడానికి ఈ విటమిన్‌ సహాయపడి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. అందుకే పాలకూరను కనీసం వారంలో రెండుసార్లు అయినా తీసుకోవాలి.

బ్రోకోలీ..

బ్రోకోలీ క్రూసీఫెరస్‌ జాతికి చెందిన కూరగాయ. బ్రోకోలీలో కూడా సహజసిద్ధంగా విటమిన్‌ కే ఉంటుంది. ఇది కేన్సర్‌కు కూడా వ్యతిరేకంగా పోరాడే లక్షణం కలిగి ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.

బ్లూబెర్రీలు..

బెర్రీ జాతికి చెందిన బ్లూబెర్రీల్లో కూడా విటమిన్‌ కే ఎక్కువే.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. సెల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగు చేస్తుంది. బ్లూబెర్రీలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా ఇందులో విటమిన్‌ కే ఉంటుంది.

క్యాబేజీ..

ఈ కూరగాయలో కూడా విటమిన్‌ కే సహజంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండకాలం కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆహారం కూడా. అంతేకాదు క్యాబేజీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది.

కీవీ పండు..

మనకు తెలిసిందే కీవీ పండులో విటమిన్‌ సీ పుష్కలం. ఇందులో నిమ్మకాయ, ఆరెంజ్‌ కంటే కూడా ఎక్కువ విటమిన్‌ సీ ఉంటుంది. అయితే ఈ పండులో విటమిన్‌ కే కూడా ఉంటుంది. రోజులో మన శరీరానికి కావాల్సిన 25 శాతం విటమిన్‌ కే ఒక కీవీ పండులో ఉంటుంది. అంతేకాదు ఈ పండు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చు.

Tags:    

Similar News