Black Raisins: ఈ నీళ్లు తాగితే చాలు మెరిసే అందం.. నిత్యయవ్వనం, కుర్రాళ్ల చూపు మీ వైపే..!
Black Raisins Benefits: సాధారణంగా మనం తినే కిస్మిస్ పసుపు రంగులో ఉంటాయి. అయితే నల్ల కిస్మిస్ ఎప్పుడన్నా తిన్నారా? వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Black Raisins: ఈ నీళ్లు తాగితే చాలు మెరిసే అందం.. నిత్యయవ్వనం, కుర్రాళ్ల చూపు మీ వైపే..!
Black Raisins Benefits: సాధారణంగా మనం తినే కిస్మిస్ పసుపు రంగులో ఉంటాయి. అయితే నల్ల కిస్మిస్ ఎప్పుడన్నా తిన్నారా? వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వీటిని మార్కెట్లో కనిపిస్తే వీటితో ఏం ప్రయోజనం ఉండదేమో అని తక్కువ అంచనా వేయకండి. మామూలు కిస్మిస్ కంటే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.
నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల బ్యూటీ బెనిఫిట్స్ కూడా బోలెడు. వీటితో మీ అందం కూడా రెట్టింపు అవుతుంది. ముఖంపై త్వరగా వృద్ధాప్య అంత త్వరగా రాకుండా నివారిస్తుంది. . నల్ల కిస్మిస్ నానబెట్టిన నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం
నల్ల ద్రాక్ష నేచురల్ లాక్సేటివ్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక మలబద్దక సమస్య కూడా ఇది ఎఫెక్టీవ్ రెమిడీగా చెప్పవచ్చు.ప్రతిరోజు ఉదయం పరగడుపున నల్ల ద్రాక్ష నానబెట్టిన నీటిని తీసుకోవాలి.
అంతేకాదు ఈ నీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ ముఖంపై ఉండే యాక్నే త్వరగా తొలగిపోతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. నల్ల ద్రాక్ష నానబెట్టిన నీటి వల్ల ముఖంపై మచ్చలు, గీతాలు త్వరగా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది.
రెగ్యులర్‌గా నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల ఇది జీర్ణ క్రియకు ప్రేరేపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడే గుణాలు ఉంటాయి. ఖనిజాలను వెంటనే గ్రహిస్తాయి. ఈ మండే ఎండాకాలంలో మీ చర్మానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. నల్ల ద్రాక్షలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో మీ చర్మం నిత్యం యవ్వనంగా కనిపిస్తుంది. నల్ల ద్రాక్ష నీటిని తరచూ తీసుకోవటం వల్ల ముఖంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మచ్చలు, గీతలు ఉంటే తొలగిపోతాయి. చర్మం యవ్వనంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి.
నల్ల ద్రాక్షలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీంతో ఎనిమియ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి పరిష్కారం. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాదు తక్షణ శక్తిని కూడా అందించే లక్షణం ఇందులో ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది నల్ల ద్రాక్ష. ఇందులో ఐరన్, విటమిన్స్ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారించి కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. చుండ్రు సమస్య రాకుండా కాపాడుతుంది.