Mango Peel: తొక్కే కదా అని పారేయకండి.. మామిడి తొక్కలో ఉండే ఈ ప్రయోజనాలు తెలుసా..?

Mango Peel Benefits: ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. ఇవి రుచికరంగా తీయగా ఉంటాయి. అయితే తొక్క తీసేసి కేవలం గుజ్జు మాత్రమే తింటాం. అయితే ఆ తొక్క పారేయకండి. అందులో ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.

Update: 2025-03-14 05:37 GMT
Mango Peel Do not Throw It Away Discover the Amazing Health Benefits of it

Mango Peel: తొక్కే కదా అని పారేయకండి.. మామిడి తొక్కలో ఉండే ఈ ప్రయోజనాలు తెలుసా..?

  • whatsapp icon

Mango Peel Benefits: సాధారణంగా ఏ పండు తిన్నా తొక్క తీసేసి గుజ్జు మాత్రమే తింటారు. అయితే అరటిపండు తొక్కతో బోలెడు ప్రయోజనాలు ఉన్నట్టు.. మామిడి తొక్కలో కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

మామిడి తొక్కలో మ్యాగ్నీఫెరిన్, బెంజోఫినోన్ ఉంటుంది, ఇది క్రిములను నాశనం చేసే గుణాలు కలిగి ఉంటాయి, మామిడి తొక్కలోను సహజ పెస్టిసైడ్స్‌లా పనిచేస్తుంది. మీ మొక్కలకు మామిడి తొక్కలు ఎండబెట్టి పొడిచేసి నీటిని స్ప్రెడ్ చేయటం వల్ల మొక్కలకు పట్టిన చీడా పీడా బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఫంగస్ బారిన పడకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

యాంటీ డయాబెటిక్..

మామిడి తొక్కతో తయారు చేసిన నీటిని తీసుకోవటం వల్ల మంచి డిటాక్స్పై గుణాలు కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మామిడి తొక్కలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అయితే పండు తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగిపోతాయి..

మామిడి తొక్క చర్మంపై అప్లై చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది. ఇందులో పాలీఫెనల్స్‌, కెరోటాయినడ్స్‌ ఉంటాయి. ఇవి చర్మంపై అప్లై చేయడం వల్ల యూవి హానికర కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

పంటి ఆరోగ్యానికి కూడా ఈ మామిడి తోక్కలు మేలు చేస్తాయి. ఇందులో యాంటీ మైక్రోబియాల్ గుణాలు ఉంటాయి. బాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. మామిడి తొక్కలను నమిలి నోరు కడగటం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. పంటి సంబంధిత సమస్యలు రాకుండా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి

అంతేకాదు మామిడి తొక్కలో గాయాలు నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో టానిన్స్‌ ఉంటాయి. ఇవి త్వరగా గాయాలను మానుస్తాయి. గాయాల పైన ఈ మ్యాంగో తొక్కలు రుద్దటం వల్ల మంచి చికిత్సల పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ బారి నుంచి బయటపడతారు

యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. ఇందులో మ్యాగీఫెరిన్ క్యాన్సర్ సెల్ అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ మామిడి తొక్కలను ఎండబెట్టి పొడి మాదిరి తయారు చేసుకోవచ్చు. వీటిని చట్నీ లేదా స్మూథీలో కూడా తీసుకోవచ్చు. మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా ఉంటాయి. టీ రూపంలో కూడా తయారు చేసుకుని తీసుకోవాలి.

Tags:    

Similar News