Health: యువతలో పెరుగుతోన్న ఫ్యాటీ లివర్ సమస్య.. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా.?
Fatty Liver in Young Adults: ప్రస్తుతం ఫ్యాటీ లివర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

Health: యువతలో పెరుగుతోన్న ఫ్యాటీ లివర్ సమస్య.. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా.?
Fatty Liver in Young Adults: ప్రస్తుతం ఫ్యాటీ లివర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం.. భారతదేశంలో 80 శాతం మంది ఐటీ నిపుణులు పని ఒత్తిడి కారణంగా శారీరక శ్రమలు సరిగ్గా చేయలేకపోతున్నారని ఇటీవలి పరిశోధనలో తేలింది. దీని కారణంగా వారు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు.
జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ హెపటాలజీలో ప్రచురించిన వివరాల ప్రకారం భారత్‌లోని పెద్దల్లో 38 వాతం మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడుతున్నట్లు తేలింది. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు పెరగడం. ఫ్యాటీ లివర్‌లో నాలుగు దశలు ఉన్నాయి. సాధారణ కొవ్వు కాలేయం, వాపు (స్టీటోహెపటైటిస్), ఫైబ్రోసిస్, సిర్రోసిస్. ఫ్యాటీ లివర్‌ను సకాలంలో గుర్తిస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.
ఫ్యాటీ లివర్‌లో కనిపించే లక్షణాలు:
* తరచుగా వాంతులు అవుతున్నట్లు అనిపించడం. వికారంగా ఉండడం.
* ఆకలి తగ్గుతుంది.
* తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
* ఎలాంటి పనిచేయకపోయినా తరచూ అలసిపోయినట్లు అనిపించడం.
* అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం.
* బరువు తగ్గడం.
* కడుపు పైభాగంలో వాపు కనిపించడం. వంటివన్నీ ఫ్యాటీ లివర్ సంకేతంగా చెప్పొచ్చు.
ఫ్యాటీ లివర్ నివారణ కోసం ఏం చేయాలంటే.?
మందులతో పాటు, ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని నివారణలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. మంచి నీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి.
* ప్రతీ రోజూ కచ్చితంగా క్రమం తప్పకుండా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
* ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ వెల్లుల్లిని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
* రాత్రుళ్లు త్వరగా భోజనం చేయాలి. వీలైనంత వరకు పడుకునే మూడు గంటల ముందే భోజనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
* మద్యం, స్మోకింగ్ వంటి అలవాట్లకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
* తీసుకునే ఆహారాన్ని పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలి. కడుపు ఉబ్బరాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.
* వీలైనంత ఎక్కువగా బ్రోకలీ, చేపలు, అవకాడోను ఆహారంలో భాగం చేసుకోవాలి.