Health: పుట్టగొడుగులను ఇలా తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ బలాదూర్‌..!

Health: శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్‌ డి, కాల్షియం ప్రధానమైనవి. ఇవి రెండు పరస్పరం అనుసంధానంగా పనిచేస్తాయి.

Update: 2025-03-14 12:00 GMT
Health: పుట్టగొడుగులను ఇలా తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ బలాదూర్‌..!
  • whatsapp icon

Health: శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్‌ డి, కాల్షియం ప్రధానమైనవి. ఇవి రెండు పరస్పరం అనుసంధానంగా పనిచేస్తాయి. శరీరానికి విటమిన్ డి సరిపడ లభించకపోతే.. శరీరంలో కాల్షియం శోషణ తక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనపడి, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే కాల్షియం సప్లిమెంట్లతో పాటు విటమిన్ డి కూడా తీసుకోవడం ఎంతో అవసరం. ఈ సమస్యను పరిష్కరించడంలో పుట్టగొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయి. విటమిన్‌ డీని పుష్కలంగా అందించడమే ఇందుకు కారణం. ఇంతకీ పుట్టగొడుగుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి.? వీటిని ఎలా తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక కప్పు పుట్టగొడుగుల్లో సుమారు 6.7 IU విటమిన్ డి ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్ డి లో కొంత భాగాన్ని అందించగలదు. విటమిన్ డి వల్ల కాల్షియం శోషణ మెరుగవుతుంది, ఇది ఎముకల దృఢతను పెంచుతుంది. పుట్టగొడుగుల్లో కొద్దిపాటి కాల్షియం కూడా ఉంటుంది.

* ఇంతకీ పుట్టగొడుగులను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేయించిన పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందుకోసం ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడగాలి. కొద్దిగా నూనె, ఉప్పు చల్లి తక్కువ మంట మీద మూతపెట్టి వేయించండి. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా పోషకాలు నష్టపోకుండా ఉంటాయి.

* పుట్టగొడుగులను సూప్‌ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఇతర కూరగాయలను కలిపి తీసుకుంటే మరిన్ని ఎక్కువ పోషకాలు లభిస్తాయి. భోజన చేసే ముందు ఈ సూప్‌ తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

* ఉడికించిన పుట్టగొడుగులతో కొద్దిగా మిరియాలు, ఉప్పును కలిపి కూరగా చేసుకోవచ్చు. ఇది రుచుకరంగా ఉండడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

* పుట్టగొడుగుల స్టిర్‌ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం నూనెతో పాటు ఉల్లిపాయ, బెల్లం మిరపకాయలు వంటి పదార్థాలతో పుట్టగొడుగులను స్టిర్‌ఫ్రై చేయవచ్చు. ఈ వంటకాన్ని లంచ్ లేదా డిన్నర్‌లో తీసుకోవచ్చు.

గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News