Women: స్త్రీలు గర్భం దాల్చకపోవడానికి ఇవి కూడా కారణాలు..

Infertility in women: ఇటీవల సంతానలేమి సమస్యలు భారీగా పెరుగుతున్నాయి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవనశైలి కారణం ఏదైనా చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు.

Update: 2025-03-13 01:40 GMT
Women: స్త్రీలు గర్భం దాల్చకపోవడానికి ఇవి కూడా కారణాలు..

Women: స్త్రీలు గర్భం దాల్చకపోవడానికి ఇవి కూడా కారణాలు..

  • whatsapp icon

Infertility in women: ఇటీవల సంతానలేమి సమస్యలు భారీగా పెరుగుతున్నాయి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవనశైలి కారణం ఏదైనా చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. స్త్రీలలో సంతానలేమి సమస్యలకు ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* థైరాయిడ్, PCOS (పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్) వంటి ఆరోగ్య సమస్యలు హార్మోన్ల బ్యాలెన్స్‌ను చెడగొడతాయి. ఇవి ఋతుచక్రం మీద ప్రభావం చూపి, గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి.

* ఫెలోపియన్ ట్యూబ్‌లు అవరోధానికి గురవుతే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ ఉంటే, లేదా ఎండోమెట్రియోసిస్ వంటి పరిస్థితులు ఉన్నా గర్భం దాల్చడం కష్టం అవుతుంది.

* అండం విడుదల కాలేకపోవడం లేదా రుతుక్రమం అసాధారణంగా ఉండటం వల్ల గర్భధారణలో సమస్యలు ఎదురవుతాయి.

* వయస్సు పెరిగేకొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రత్యేకంగా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయి.

* ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు, అహారపు అలవాట్లు సరిగా లేకపోవడం ఇవన్నీ వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచతాయి.

* శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, రసాయనాలతో కలుషితమైన ఆహారం తీసుకోవడం కూడా ప్రతికూలంగా పనిచేస్తాయి.

* యవ్వనంలోనే మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా, వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: ఇలాంటి సమస్యలు ఎదురైతే కేవలం స్త్రీల సమస్యగా తీసుకోకూడదు. పురుషుల పునరుత్పత్తి సామర్థ్యం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతుంటే, వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఈ రోజుల్లో వైద్యం అభివృద్ధి చెందడంతో వంధ్యత్వానికి సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News