Rice Water: బియ్యం కడిగిన నీటితో మీ ముఖం తెల్లగా మెరవాలంటే?

Rice Water For Glowing Skin: అందరి ఇళ్లలో బియ్యం అందుబాటులో ఉంటాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందుతారు, చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.

Update: 2025-03-17 02:30 GMT

Rice Water For Glowing Skin: బియ్యం కడిగిన నీటితో ముఖంపై మచ్చలు, గుంతలు కూడా తొలగిపోతాయి, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది ముఖానికి మంచి పోషణ కూడా అందిస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. బియ్యం కడిగే నీటితో చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

రైస్ వాటర్ గంజి మాదిరి ఉంటుంది. ఇది కడిగిన నీటిని ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ముఖానికి వాడాలి. ఇది జుట్టు, ముఖానికి ఆరోగ్యం. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ నీటితో ముఖాన్ని కడగాలి. ఉదయం ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మచ్చ లేని గ్లోయింగ్‌ స్కిన్‌ పొందుతారు. ముఖం పై ఉండే మచ్చలు, గీతలు తొలగిపోతాయి.

బియ్యం కడిగిన నీటిని ముఖానికి ఉపయోగించడం వల్ల ఇందులోనే విటమిన్స్, మినరల్స్ చర్మం కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో ఫెరులిక్ యాసిడ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి.

ముఖంపై మచ్చలు, దురదలు తొలగిపోతాయి. చర్మంపై ఉండే ఎగ్జీమా, యాక్నేను తొలగిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో ఉంటాయి. ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ఈవెన్‌ స్కిన్‌ టోన్‌ అందిస్తుంది. చర్మ పీహెచ్‌ లెవల్స్‌ సమతులం చేస్తుంది.

ఇక బియ్యం కడిగిన నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడతాయి. త్వరగా వృద్ధాప్యలో ముఖంపై కనిపించవు. మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తొలగిపోతాయి.

బియ్యం కడిగిన నీటిని కాటన్‌తో ముఖాన్ని క్లెన్స్‌ చేసుకోవచ్చు. లేదంటే ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసుకుని కాసేపటి తర్వాత ముఖాన్ని క్లీన్‌ చేయాలి. ఈ నీటిని ముఖం కాకుండా జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో జుట్టు కడగాలి. కాసేపటి తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. స్ల్పిట్స్‌ రాకుండా ఉంటాయి.

Tags:    

Similar News