Pumpkin: గుమ్మడికాయతో గోల్డెన్‌ గ్లో.. ఎప్పుడైనా ఈ ఫేస్ మాస్క్ ట్రై చేశారా?

Golden Glow With Pumpkin: చర్మం, ముఖం అందంగా కనిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని ఫేస్ ప్యాక్ లు మాస్కులు కూడా ఉపయోగిస్తారు.

Update: 2025-03-16 02:00 GMT

Golden Glow With Pumpkin: ముఖం అందంగా కనిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. పార్లర్‌కు సైతం వెళ్లి వేలల్లో ఖర్చు పెడతారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే కూడా గోల్డెన్ గ్లో ముఖంపై పొందుతారు. ఈరోజు అలాంటి రెమెడీ తెలుసుకుందాం. ముఖ్యంగా గుమ్మడికాయ ఇది వంటలో వినియోగిస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. అయితే దీంతో మనం ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే మచ్చలేని మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ఎందుకంటే గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో తయారు చేసిన ఫేస్ మాస్క్ వల్ల ముఖంపై గీతలు తొలగిపోతాయి. అంతేకాదు మచ్చలేని అందం మెరుస్తూ కనిపిస్తుంది.

గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో మీ ముఖం ఈవెన్ స్కిన్‌ టోన్‌ పొందుతారు. ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ కూడా తొలగిపోయి మెరుస్తూ కనిపిస్తుంది.

అంతేకాదు గుమ్మడికాయలో ఉండే జింక్ సూర్యుడు హానికర యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. ముఖంపై ఉండే యాక్నేను కూడా తొలగిస్తుంది.

గుమ్మడికాయలో సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి ఎక్కువ సేపు తాజాదనం అందిస్తుంది. ఇందులోని ఖనిజాలు ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకు ప్రేరేపిస్తాయి.

గుమ్మడికాయ ఫేస్ మాస్క్ వేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా స్కిన్ టోనర్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అప్పుడు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. గుమ్మడికాయను తేనే లేదా పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. లేకపోతే కలబంద జెల్ గుమ్మడికాయ పేస్టు మాదిరి తయారు చేసుకుని ముఖం, మెడ భాగంలో అప్లై చేయాలి. దీంతో మచ్చలేని అందం మెరుగైన స్కిన్‌ టోన్‌ పొందుతారు.

గుమ్మడి కాయ పేస్ట్‌లో చక్కెర వేసి ముఖానికి స్క్రబ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని సర్క్యూలర్‌ మోషన్‌లో ముఖం మెడ భాగంలో రుద్దాలి. ఆ తర్వాత ఫేస్‌ వాష్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ తొలగిపోతాయి.

Tags:    

Similar News