Cucumber: కీరదోసకాయతో పొరపాటున ఈ 5 ఆహారాలు కలిపి తినకూడదు.. తస్మాత్‌ జాగ్రత్త..!

Cucumber Wrong Combination: ఎండాకాలం కీరదోసకాయ ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే కీరదోసకాయతో కలిపి తీసుకోకూడని ఫుడ్స్‌ ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

Update: 2025-03-15 14:00 GMT

Cucumber: కీరదోసకాయతో పొరపాటున ఈ 5 ఆహారాలు కలిపి తినకూడదు.. తస్మాత్‌ జాగ్రత్త..!

Cucumber Wrong Combination: కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో 95 శాతానికి పైగా ఉంటుంది. అందుకే ఎండాకాలం వాటిని తీసుకోవడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటారు. కీరదోసకాయ జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. నేరుగా కూడా తీసుకోవచ్చు. అయితే, కీరదోసకాయలో అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఓ ఐదు రకాల ఆహారాలతో కీరదోసకాయ పొరపాటున తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

నాన్‌ వెజ్‌..

కీరదోసకాయను పొరపాటున కూడా నాన్‌ వెజ్‌తో కలిపి తీసుకోకూడదు. ఇది జీర్ణ సమస్యలకు దారితస్తుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌, అజీర్తికి దారితీస్తుంది. కానీ, ఎక్కువ శాతం కీరదోసకాయను స్లైసెస్‌గా కట్‌ చేసి ఉల్లిపాయలు, కీరదోసకాయలు తింటారు.

టమోటాలు..

కీరదోసకాయతో టమోటాలు కూడా కలిపి తినకూడదు. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి చేస్తుంది. టమోటా, కీరదోసకాయ రెండిటినీ కలిపి సలాడ్‌ కూడా చేయకూడదు.

సిట్రస్‌ పండ్లు..

కీరదోసకాయను పొరపాటున కూడా సీట్రస్‌ పండ్లతో కలిపి తీసుకోకూడదు. అంటే నిమ్మ, ఆరెంజ్‌ వంటి పండ్లతో కీరదోసకాయ తీసుకుంటే కడుపులో యాసిడ్‌ స్థాయిలు ఎక్కువవుతాయి. తద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే నిమ్మరసం కీరదోసకాయ రెండూ కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు.

పాలకూర..

నీటి శాతం అధికంగా ఉండే కీరదోసకాయను పాలకూరతో కలిపి తీసుకోకూడదు. ఈ రెండిటినీ కలపి తినడం వల్ల మన శరీరం విటమిన్‌ సీ గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆకుకూరలు కూడా ఆరోగ్యకరమే అయినా ఇలాంటి కొన్ని ఆహారాలతో కలిపి తినకూడదు.

పాల పదార్థాలు..

పాలు, పాల పదార్థాలతో కలిపి కూడా కీరదోసకాయ తినకూడదు. ఇది కూడా కడుపులో అజీర్తి, గ్యాస్‌ పెంచుతుంది. ఈ ఆహారాలు మాత్రమే కాదు వెల్లుల్లి కూడా కీరదోసకాయతో కలిపి తినకూడదు. దాని రుచి పూర్తిగా మారిపోతుంది కూడా.

Tags:    

Similar News