Cooking Tips: కూరలో ఉప్పు ఎక్కువైందా..? ఈ చిట్కాలతో సరిచేసుకోండి..

Salt Reducing Tips: కూరలో ఉప్పు లేనిదే రుచించదు. ఉప్పులేని సప్పిడి కూడా తినాలని కూడా అనిపించదు.

Update: 2025-03-17 01:45 GMT
Cooking Tips: కూరలో ఉప్పు ఎక్కువైందా..? ఈ చిట్కాలతో సరిచేసుకోండి..
  • whatsapp icon

Salt Reducing Tips: కూరల్లో ఉప్పు వేసుకోకుంటే అది రుచించదు. ఏ కూరలు తయారు చేసినా ఉప్పు తప్పనిసరి. అయితే ఎప్పుడైనా కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే దాన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

అతిగా ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకున్నా బ్లడ్ ప్రెజర్‌ ఎక్కువవుతుంది. అంతేకాదు ఉప్పు గుండెకు ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. అంతేకాదు అలాంటి కూర రుచించదు. తినడం మన వల్ల కూడా కాదు కొన్నింటి చిట్కాలతో కూరల్లో ఉప్పును సరి చేసుకోవచ్చు.

ఎప్పుడైనా మీరు చేసిన కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఉడకబెట్టిన బంగాళదుంప మ్యాష్‌ చేసి ఉప్పు ఎక్కువైన కూరలో వేయండి. అప్పుడు బంగాళదుంప ఉప్పును గ్రహించేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిన సరిపోతుంది.

కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు పెరుగు బాగా కలిపి ఆ కూరల్లో వేయాలి. అప్పుడు ఉప్పు సరిపోతుంది. ఇది కాకుండా నెయ్యి కూడా వేసుకుంటే సరిపోతుంది. కాస్త వేడి చేసిన నెయ్యి ఆ కూరలో వేయటం వల్ల ఉప్పు ప్రభావం తగ్గిపోతుంది.

నిమ్మకాయతో కూడా ఉప్పుని సరిచేసుకోవచ్చు. మనం వండి కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు నిమ్మరసం పిండాలి. ఇది అతిగా ఉన్న ఉప్పును సమతులం చేస్తుంది. ఇక కొన్ని రకాల కూరల్లో పిండి ముద్దలు చేసి అందులో వేసి ఉంచాలి. కాసేపటి తర్వాత వాటిని తీసేయాలి. ఇలా చేయడం వల్ల పిండి ముద్దలు ఉప్పును గ్రహించేస్తుంది. తద్వారా ఉప్పు సమం అయిపోతుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి.

కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఇలాంటి చిట్కాలు పాటించండి. తద్వారా అతిగా ఉప్పు ఉండే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు పెద్ద వయసు వారు ఉప్పు అతిగా ఉంటే తీసుకోకూడదు. 30 వాళ్ళు దాటిన వారు కూడా ఉప్పు సరిచూసి తీసుకోవాలి. ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Tags:    

Similar News