Cucumber Water: ఈ కీరదోస నీళ్ల ముందు.. ఖరీదైన డ్రింకులు కూడా దిగదుడుపే..!
Cucumber Water Benefits: కీరదోస మనకు ఎండాకాలంలో హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ ఖనిజాలు ఉంటాయి. మంచి తాజాదనం కూడా అందిస్తుంది.

Cucumber Water: ఈ కీరదోస నీళ్ల ముందు.. ఖరీదైన డ్రింకులు కూడా దిగదుడుపే..!
Cucumber Water Benefits: కీర దోసకాయ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. అంతేకాదు ఎండాకాలంలో అజీర్తికి చెక్ పెడుతుంది. బరువు నిర్వహణలో ఉన్న వాళ్ళు కూడా కీరదోసకాయ తీసుకోవాలి.
ఈ కీర దోసకాయ చల్లని గుణాలు కలిగి ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఎండాకాలం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కడుపున చల్లబరుస్తుంది. కీరదోసకాయ, పుదీనా, అల్లంతో కలిపి తీసుకుంటే మరింత పోషకమైన డ్రింక్‌గా మారుతుంది. మన శరీరానికి మంచి పోషణ అందిస్తుంది.
ఎండాకాలం ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కీరదోశలో ఉండే 95% కంటే ఎక్కువ నీరు మనకు మంచి నేచురల్ హైడ్రేటెడ్ గా పనిచేస్తుంది. అంతేకాదు క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. బరువు నిర్వహణలో ఉంటారు.
కీరదోస మన దగ్గర డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది దీర్ఘకాలిక మలబద్ధక సమస్య నుంచి బయటపడతారు కడుపులో అజీర్తికి చెక్ పెడుతుంది. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది.
ఇది మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇందులో నేచురల్ డైరుటిక్ గుణాలు ఉంటాయి. కిడ్నీ పని తీరును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సిలికా ఉండటం వల్ల మన చర్మానికి సాగే గుణం అందిస్తుంది. ముఖానికి న్యాచురల్ గ్లో ఇస్తుంది.
కీర దోసకాయ నీటిని తీసుకోవటం వల్ల ఇది మన శరీరంలో ఉన్న సోడియం స్థాయిలను సమతులం చేసి బీపీని అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరాను మెరుగు చేసే గుణం కీరదోసకాయలో ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఇక కీరదోసకాయలో యాంటీ ఫ్లెవనాయిడ్స్, టానిన్స్ ఉంటాయి. ఇది మంట సమస్యలు తగ్గిస్తుంది. ఒక జగ్గు నీటిలో ఒక కీరదోసకాయ కట్ చేసి వేసి వాటిని రాత్రంతా అలాగే పెట్టి ఉదయం నిమ్మరసం లేదా పుదీనా అల్లం వేసి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. త్వరగా బరువు కూడా తగ్గుతారు.