Health: కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? ఎలా గుర్తించాలి.?

Kidney Stones: ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వినడానికి చిన్న సమస్యగా అనిపించినా ఈ సమస్య బారినపడ్డవారు భరించలేని నొప్పితో ఇబ్బంది పడుతుంటారు.

Update: 2025-03-17 11:36 GMT

Health: కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? ఎలా గుర్తించాలి.?

Kidney Stones: ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వినడానికి చిన్న సమస్యగా అనిపించినా ఈ సమస్య బారినపడ్డవారు భరించలేని నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఎక్కువైతే రాళ్లు ఏర్పాడుతాయి. ఈ రాళ్ల పరిమాణం మనిషిని బట్టి మారుతుంది. కొన్ని ఇసుక రేణువులంత చిన్నగా ఉంటే, కొన్ని గులకరాళ్లంత పెద్దగా ఉండవచ్చు. ఈ రాళ్లు మూత్రనాళంలోకి వచ్చేటప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

సాధారణంగా చిన్న చిన్న రాళ్లు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆపరేషన్‌ కూడా చేయాల్సి వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన కారణాలు వంటివి దీనికి కారణం కావచ్చు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యను కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

కిడ్నీలో రాళ్ల లక్షణాలు:

వెన్ను లేదా కడుపు నొప్పి

మూత్రంలో రక్తం

వికారం

తరచూ మూత్రం రావడం

కిడ్నీలో పలు రకాల రాళ్లు:

కాల్షియం ఆక్సలేట్ రాళ్లు

యూరిక్ యాసిడ్ రాళ్లు

స్ట్రువైట్ రాళ్లు

సిస్టీన్ రాళ్లు

ప్రతి రకానికి వేర్వేరు కారణాలు, వేర్వేరు చికిత్సలు ఉంటాయి. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News