World Kidney Day 2025: కిడ్నీలను పాడు చేసే ఆహారాలు ఇవే.. వీటిని పరిమితంగానే తీసుకోండి

World Kidney Day 2025: మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కిడ్నీలు పనిచేస్తాయి.

Update: 2025-03-12 00:30 GMT
World Kidney Day 2025

World Kidney Day 2025: కిడ్నీలను పాడు చేసే ఆహారాలు ఇవే.. వీటిని పరిమితంగానే తీసుకోండి

  • whatsapp icon

World Kidney Day 2025: మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కిడ్నీలు పనిచేస్తాయి. కిడ్నీల్లో లోపం ఉంటే శరీరంలో పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలోని ఖనిజాలు, నీరు మొదలైన వాటి సమతుల్యతను కాపాడుకోవడానికి కిడ్నీలు సరిగా పనిచేయాలి. చాలా మంది ఉప్పు ఎక్కువగా తినడం లేదా ధూమపానం, మద్యం తాగడం మూత్రపిండాలకు హానికరం అని అనుకుంటారు. కానీ మనకు ఆరోగ్యంగా అనిపించే అనేక విషయాలు ఉన్నాయి. వాటి అధిక వినియోగం మన కిడ్నీలు మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 13న జరుపుకుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. అధిక సోడియం కలిగిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు మొదలైనవి కిడ్నీలతో సహా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది కాకుండా కొన్ని ఆరోగ్యకరమైనవిగా భావించి తినే వస్తువులు ఉన్నాయి. కానీ అవి మీ కిడ్నీలకు హాని కలిగిస్తాయి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

పాలు , దాని ఉత్పత్తులైన జున్ను, వెన్న మొదలైనవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తాము. కానీ కొవ్వు పాలు, దాని ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. వాటి పని తీరును ప్రభావితం చేస్తుంది.

చాలా మందికి నాన్-వెజ్ తినడమంటే చాలా ఇష్టం. ప్రజలు దీనిని ప్రోటీన్ అద్భుతమైన మూలం అని భావిస్తారు.. కానీ ప్రోటీన్‌తో పాటు, ఎర్ర మాంసంలో కూడా అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఇది కిడ్నీలకు హాని కలిగిస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ కూడా యూరిక్ యాసిడ్‌కు కారణమవుతుంది. అధిక ప్రోటీన్ , కొవ్వు ఉన్నప్పుడు కిడ్నీలు వ్యర్థాలను సరిగ్గా తొలగించలేవు. దీని కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది కిడ్నీల ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

చాలా మంది మార్కెట్ నుండి క్యాన్డ్ జ్యూస్ వంటి ఆరోగ్యకరమైన వస్తువులను కొని తింటారు. కానీ వీటిలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు అలాగే చక్కెర, సోడియం, నూనె మొదలైనవి ఉంటాయి. ఇవి మీ కిడ్నీలకు హాని కలిగిస్తాయి. కండరాలను పెంచడానికి చాలా మంది ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు . ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తింటారు.. కానీ ఇది కిడ్నీల ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి రోజువారీ అవసరం మేరకు మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ పౌడర్ కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

టీ, కాఫీ వంటి కెఫిన్ ఉన్న వాటిని తీసుకోవడం, అరటిపండు ఎక్కువగా తినడం, టమోటాలు ఎక్కువగా తినడం లేదా బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల కూడా కిడ్నీలకు హాని కలుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగడం మంచింది. కానీ ఎక్కువ నీరు త్రాగడం వల్ల మీ మూత్రపిండాలకు కూడా హాని కలుగుతుంది.

Tags:    

Similar News