Health: ఈ చేపను తినలేరు కానీ ఎన్నో ఆరోగ్య లాభాలు.. ఇంతకీ అది ఏంటంటే
Iron Fish: సోషల్ మీడియాలో ఇటీవల ఐరన్ ఫిష్ గురించి పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. తినడానికి వీలు పడని ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటీ ఐరన్ ఫిష్, దీని ఉపయోగాలు ఏంటి.? దీని వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది ఇనుప లోహంతో తయారు చేసిన చిన్న చేప ఆకారపు వస్తువు. రక్తహీనత (ఐరన్ లోపం) సమస్యతో బాధపడుతున్న వారికి ఆహారం ద్వారా ఐరన్‌ను అందించడంలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కారణంగా అలసట, బలహీనత, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అయితే ఈ సమస్యకు ఐరన్ ఫిష్ మంచి పరిష్‌కారం అని నిపుణులు చెబుతున్నారు. వంట చేసే సమయంలో నీటిలో లేదా సూప్‌లో ఐరన్ ఫిష్‌ను 10 నిమిషాలు మరిగిస్తే, ఆహారంలోకి ఐరన్ విడుదల అవుతుంది. శరీరం దీనిని సులభంగా గ్రహించగలదు. ఇది తక్కువ ఖర్చుతో లభించడం మరో ప్రత్యేకత. 2008లో కెనడియన్ హెల్త్ వర్కర్ క్రిస్టోఫర్ చార్లెస్ కాంబోడియాలో ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో సమస్యలు ఎదుర్కొనటం గమనించి, ఈ పద్ధతిని అభివృద్ధి చేశారు. 2012లో "ది లక్కీ ఐరన్ ఫిష్ ప్రాజెక్ట్" ద్వారా దీని ఉత్పత్తి, పంపిణీ ప్రారంభమైంది.
ఎలా ఉపయోగించాలంటే.?
వాడేముందు ఐరన్ ఫిష్‌ను శుభ్రంగా కడగాలి. వంట సమయంలో నీటిలో లేదా సూప్‌లో 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని తీసివేసి, ఆహారాన్ని వడ్డించాలి. ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడిగి, తుడిచి భద్రపరుచుకోవాలి. ఇలా చాలా సార్లు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా దేశాల్లో వీటి ఉపయోగం పెరుగుతోంది. మరెందుకు మీరు కూడా ఓసారి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.