Lifestyle: మద్యం తాగితే నిజంగానే నిద్ర పడుతుందా.? ఇందులో నిజమెంత..
Alcohol and Sleep Quality: కొంతమంది రాత్రి నిద్ర బాగా రావాలన్న ఉద్దేశంతో మద్యం తాగే అలవాటు పెట్టుకుంటారు. అయితే, ఇది సమూలంగా తప్పు. మద్యం తాగితే మత్తులో కొద్దిసేపు నిద్ర ముంచుకొచ్చినా, అది గాఢ నిద్రకు అడ్డుపడుతుంది.

Lifestyle: మద్యం తాగితే నిజంగానే నిద్ర పడుతుందా.? ఇందులో నిజమెంత..
Alcohol and Sleep Quality: కొంతమంది రాత్రి నిద్ర బాగా రావాలన్న ఉద్దేశంతో మద్యం తాగే అలవాటు పెట్టుకుంటారు. అయితే, ఇది సమూలంగా తప్పు. మద్యం తాగితే మత్తులో కొద్దిసేపు నిద్ర ముంచుకొచ్చినా, అది గాఢ నిద్రకు అడ్డుపడుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. సాధారణంగా రాత్రిపూట మన నిద్ర దశలుగా ఉంటుంది. మొదట తేలికపాటి నిద్ర (లైట్ స్లీప్), ఆపై గాఢ నిద్ర (డీప్ స్లీప్), తదుపరి 'రెమ్ స్లీప్' దశలు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. ఈ ఒక్కో దశ కూడా సుమారుగా 90-120 నిమిషాల వ్యవధిలో తిరుగుతుంది.
కానీ మద్యం తాగినప్పుడు, ఈ సహజ నిద్ర చక్రంలో అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా రెమ్ స్లీప్ దశ తగ్గిపోతుంది. ఇది గాఢ నిద్రకు సంబంధించిన అతి ముఖ్యమైన దశ. ఈ దశలోనే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది, మెదడు తిరిగి శక్తిని సంతరించుకుంటుంది. జ్ఞాపకశక్తి, మనోధైర్యం ఈ దశపై ఆధారపడి ఉంటాయి.
అందువల్ల మద్యం తాగిన తర్వాత ఎన్ని గంటల నిద్రపోయినా, ఉదయం లేచిన తర్వాత అలసట, నీరసంగా ఉంటుంది. గాఢ నిద్ర లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంటే, ఎన్ని గంటలు నిద్రపోయామన్నదికాదు... ఎంత నాణ్యమైన నిద్రపోయామన్నదే ముఖ్యం. అంతేకాదు, మద్యం వల్ల ఇప్పటికే ఉన్న నిద్రలేమి, గురక, పీడకలకు దారి తీస్తాయి.
దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నిద్రను మెరుగుపరచుకోవాలంటే మద్యం కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాత్కాలికంగా నిద్రను ఇచ్చినా, దీర్ఘకాలికంగా శరీరానికి, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.