Dangerous Breakfast Foods: టిఫిన్‌లో వీటిని తీసుకుంటున్నారా.? చాలా డేంజర్..
Dangerous Breakfast Foods: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో టిఫిన్ స్కిప్ చేయకూడదని చెబుతుంటారు. రోజంతా ఎనర్జీతో ఉండాలంటే కచ్చితంగా టిఫిన్ తీసుకోవాలి.

Dangerous Breakfast Foods: టిఫిన్‌లో వీటిని తీసుకుంటున్నారా.? చాలా డేంజర్..
Dangerous Breakfast Foods: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో టిఫిన్ స్కిప్ చేయకూడదని చెబుతుంటారు. రోజంతా ఎనర్జీతో ఉండాలంటే కచ్చితంగా టిఫిన్ తీసుకోవాలి. అయితే టిఫిన్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఫుడ్స్‌ను భాగం చేసుకోకూడదని నిపుణులు చెబుతుంటారు. టిఫిన్ చేయకపోవడం ఎంత తప్పో, సరైన ఫుడ్ తీసుకోకపోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టిఫిన్‌లో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం టిఫిన్‌లో చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనిద్వారా ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటికి బదులుగా సహజంగా తీపిగా ఉండే పండ్లు, తృణధాన్యాలు, చక్కెర లేకుండా ఉండే తృణధాన్యాలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగు ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెబుతుంటారు కానీ ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పెరుగులలో తరచుగా చక్కెర, కృత్రిమ రుచులు కలిపి ఉంటాయి. ఇది బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, అనేక ఫ్లేవర్డ్ పెరుగులలో డెజర్ట్‌ల్లో ఉండేంత చక్కెర ఉంటుంది.
ఇక ఉదయం టిఫిన్‌లో ఎట్టి పరిస్థితుల్లో బ్రెడ్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. ఇందులో పోషకాలు, ఫైబర్ కంటెంట్ ఉండదు. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే జామ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఫైబర్ కంటెంట్ లేకపోతే మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.