Stone Fruits: ఇమ్యూనిటీని రాకెట్ స్పీడ్‌లో పెంచే 5 స్టోన్ ఫ్రూట్స్..!
Stone Fruits Heath Benefits: ఇమ్యూనిటీ బలంగా ఉంటేనే సీజనల్ జబ్బులు మనల్ని చుట్టుముట్టవు. అయితే, స్టోన్ ఫ్రూట్ ఇమ్యూనిటీని పెంచుతుంది. స్టోన్ ఫ్రూట్స్ అంటే వాటి బయటవైపు చర్మం దృఢంగా కనిపిస్తుంది.

Stone Fruits: ఇమ్యూనిటీని రాకెట్ స్పీడ్‌లో పెంచే 5 స్టోన్ ఫ్రూట్స్..!
Stone Fruits Heath Benefits: స్టోన్ ఫ్రూట్ ఈ పండ్లు తీయ్యగా రుచికరంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. స్టోన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బలపడుతుంది. ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ స్టోన్ పండ్లు పూర్తి మన శరీర ఆరోగ్యానికి కూడా మంచివి. ఇమ్యూనిటీ పెంచుతాయి. కాబట్టి అన్నీ సీజన్‌లలో ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. శరీర ఆరోగ్యానికి ఈ పండ్లు మన డైట్‌లో చేర్చుకోవాలి. స్టోన్ ఫ్రూట్స్ మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
పీచ్..
పీచ్ పండును స్టోన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇందులో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. ఎందుకంటే పీచ్ పండులో విటమిన్ ఏ, సీ ఉంటాయి. ఇవి సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
అప్రికాట్స్..
అప్రికాట్లలో విటమిన్ సీ, కే ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కంపౌండ్స్ ఉంటాయి. ప్లమ్ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా తటస్థం చేస్తాయి. తద్వారా ఇమ్యూనిటీ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
చెర్రీ పండ్లు..
చెర్రీ పండ్లలో విటమిన్ సీ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఎరుపు రంగులో చిన్నగా కనిపిస్తాయి. చెర్రీ పండ్లలోని విటమిన్ సీ ఇమ్యూనిటీని బలపరుస్తుంది. తెల్లరక్తకణాల ఉత్పత్తికి ఇవి ప్రేరేపిస్తాయి. చెర్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.
మామిడి పండ్లు..
మామిడి పండ్లను కూడా స్టోన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ ఎండాకాలం ఇవి విపరీతంగా మార్కెట్‌లో కనిపిస్తాయి. మామిడిపండులో కూడా విటమిన్ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని మూడింతలు బలంగా మారుస్తుంది. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ వ్యవస్థను కాపాడతాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నివారిస్తుంది.
నెక్టరీన్..
ఈ పండ్లు కూడా పీచ్ పండ్ల మాదిరి కనిపిస్తాయి. కానీ, వీటి చర్మం సున్నితంగా ఉంటుంది. నెక్టరీన్ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇమ్యూనిటీని బలంగా మారుస్తాయి. నెక్టరిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గస్తుంది. నెక్టరీన్ పండ్లు సీజనల్ ఇన్పెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి.