Curd Vs Lassi: ఎండ వేడిమి తట్టుకోవడానికి పెరుగు తినాలా? లస్సీ తాగాలా?

Curd Vs Lassi In Summer: ఎండాకాలం వచ్చిందంటే ముఖ్యంగా మన శరీరానికి తగిన నీరు తీసుకోవాలి. ఎప్పుడూ హైడ్రేటేడ్‌గా ఉండాలి. దాహం లేకున్నా నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచన.

Update: 2025-03-12 06:53 GMT
Curd Vs Lassi In Summer Which Is Better to Beat the Heat and To Stay Fit

Curd Vs Lassi: ఎండ వేడిమి తట్టుకోవడానికి పెరుగు తినాలా? లస్సీ తాగాలా?

  • whatsapp icon

Curd Vs Lassi In Summer: మండే వేసవి కాలం వచ్చేసింది. ఏదైనా చల్లచల్లగా తీసుకోవడానికే ఇష్టపడతారు. అయితే, ప్రతిరోజూ చాలామంది పెరుగు తినే అలవాటు ఉంటుంది. ఇది మంచి ప్రోబయోటిక్‌. అయితే, ఎండ వేడిమి తట్టుకోవడానికి పెరుగు తినాలా? లస్సీ తాగితే మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఎండాకాలం వచ్చిందంటే ముఖ్యంగా మన శరీరానికి తగిన నీరు తీసుకోవాలి. ఎప్పుడూ హైడ్రేటేడ్‌గా ఉండాలి. దాహం లేకున్నా నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచన. అందుకే ఎన్నో డ్రింకులు కూడా ఉంటాయి. అయితే, ఇలాంటి కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల మరింత అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మరి ఎండ వేడిమి తట్టుకునేందుకు ప్రతిరోజూ పెరుగు తింటే మంచిదా? లస్సీ తాగాలా?

లస్సీ..

లస్సీ పెరుగుతోనే తయారు చేస్తారు. ఇందులో చక్కెర వేసి తయారు చేస్తారు. కాబట్టి తీయ్యగా ఉంటుంది. లస్సీలో డ్రైఫ్రూట్స్‌ కూడా వేసి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో మరిన్ని పోషకాలు జత అవుతాయి. అయితే, ఎండకాలం లస్సీ ఎక్కువగా తీసుకుంటే మన కడుపునకు కాస్త హెవీగా అనిపించి, జీర్ణక్రియ మందగిస్తుంది. ఇందులో చక్కెర ఉంటుంది కాబట్టి బరువు కూడా పెరుగుతారు.

పెరుగు..

పెరుగు మంచి ప్రోబయోటిక్‌ ఇది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు పెరుగు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపు సమస్యలు తగ్గిపోతాయి. ఎండకాలం ఎక్కువగ వేధించే యాసిడిటీ, గ్యాస్‌ను కూడా తగ్గిస్తుంది.

పెరుగులో సహజసిద్ధమైన ఎలక్ట్రోలై ట్స్‌ ఉంటాయి. ఇది ఎండాకాలం మన శరీరం కోల్సోయిన నీటి శాతాన్ని భర్తీ చేస్తుంది. ఇది మన శరీరాన్ని ఎండ వేడిమి నుంచి రక్షిస్తుంది. పెరుగు తరచూ మన డైట్‌లో ఉండటం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇక లస్సీలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో బరువు పెరుగుతారు. ఈ మండే వేసవిలో లస్సీ కంటే పెరుగు తీసుకోవడం మేలు. దీంతో మజ్జిగ తయారు చేసుకుని తీసుకుంటే మరీ మంచిది. అయితే, రుచికి లస్సీ బాగుంటుంది కానీ, క్రీమ్‌ చక్కెర తక్కువ తీసుకోవడం మంచిది. అప్పుడప్పుడు మాత్రమే లస్సీ తీసుకోవాలి. ఫిట్‌గా ఉండాలి అంటే మాత్రం పెరుగు మాత్రమే తీసుకోండి. రోజూ మధ్యాహ్నం భోజనం సమయంలో తప్పకుండా తీసుకోవాలి. లేదా సాయంత్రం ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు మజ్జిగ తయారు చేసుకుని తీసుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, సన్నగా తరిగి అల్లం ముక్కలు వేసుకుంటే మరింత ప్రయోజనకరం.

Tags:    

Similar News