Cancer: ఈ లక్షలున్నాయా.? నోటి క్యాన్సర్‌ కావొచ్చు..

Oral Cancer Symptoms: ఇటీవల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. చిన్న వయసు వారు కూడా క్యాన్సర్‌ మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో నోటి క్యాన్సర్‌ కూడా ముఖ్యమైంది.

Update: 2025-03-12 14:36 GMT
Cancer: ఈ లక్షలున్నాయా.? నోటి క్యాన్సర్‌ కావొచ్చు..

Cancer: ఈ లక్షలున్నాయా.? నోటి క్యాన్సర్‌ కావొచ్చు..

  • whatsapp icon

Oral Cancer Symptoms: ఇటీవల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. చిన్న వయసు వారు కూడా క్యాన్సర్‌ మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో నోటి క్యాన్సర్‌ కూడా ముఖ్యమైంది. నోటి క్యాన్సర్‌ రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.? ఇంతకీ నోటి క్యాన్సర్‌ ఎందుకు వస్తుంది.? ఈ వ్యాధిని ముందుస్తు లక్షణాల ద్వారా ఎలా గుర్తించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి క్యాన్సర్‌ ముందస్తు లక్షణాలు:

* దంతాలు వదులుగా మారడం: దంతాలు అకస్మాత్తుగా వదులుగా మారుతుంటే, అది నోటి క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతం కావచ్చు. ముఖ్యంగా తక్కువ వయసు ఉన్నవారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

* నోటిలో లేదా మెడలో ఎక్కడైనా ఒక గడ్డలా కనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* పెదవులపై వాపు లేదా నయం కాని పుండ్లు కూడా క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణంగా భావించాలి.

* మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి , మాటల్లో మార్పు, నోటిలో రక్తస్రావం లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* నాలుక లేదా చిగుళ్ళపై తెల్లటి లేదా ఎరుపు రంగు మచ్చలు కనిపించినా, ఎలాంటి కారణం లేకుండా ఉన్నపలంగా బరువు తగ్గినా నోటి క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది.?

పొగాకు లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV) వంటివి నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం , చిగుళ్ల వ్యాధి, తమలపాకును ఎక్కువగా నమలడం వంటివి కూడా ఇందుకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

చికిత్స ఏంటి.?

నోటి క్యాన్సర్‌ చికిత్స.. క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. CT, MRI స్కాన్ల వంటి పరీక్షలు క్యాన్సర్ ఎంత పెరిగిందో చూపిస్తాయి. చికిత్సను నిర్ణయించుకోవడానికి వైద్యులు స్టేజింగ్‌లో సహాయపడుతుంది. నోటి క్యాన్సర్‌కు సాధారణ చికిత్స శస్త్రచికిత్స, దాని సహాయంతో కణితిని తొలగిస్తారు. ప్రారంభ దశ క్యాన్సర్‌లో శస్త్రచికిత్స ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని చిన్న నోటి క్యాన్సర్లను రేడియోథెరపీతో చికిత్స చేయవచ్చు.

గమనిక: ఈ వివరాలు ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలు పాటించాలి.

Tags:    

Similar News