Watermelon: తియ్యగా ఉండే ఎర్రటి పుచ్చకాయని గుర్తించడం ఎలా.. ?

Watermelon: ప్రస్తుతం దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ పరిస్థితిలో, దాదాపు అందరు పుచ్చకాయను ఎక్కువగా తింటారు.

Update: 2022-05-14 11:30 GMT

Watermelon: తియ్యగా ఉండే ఎర్రటి పుచ్చకాయని గుర్తించడం ఎలా.. ?

Watermelon: ప్రస్తుతం దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ పరిస్థితిలో, దాదాపు అందరు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. నిజానికి పుచ్చకాయ శరీరంలో నీటి కొరతను తీర్చే పండు. ఈ పండు తినడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లగా ఉంటుంది. ఈ పండు రుచిలో తీపిగా ఉంటుంది. పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. పుచ్చకాయలో 95% నీరు ఉంటుంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఎప్పుడూ ఉండదు. అందుకే వేసవిలో దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు.

మీరు తీపి పుచ్చకాయను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. చాలా మంది ఆకుపచ్చ పుచ్చకాయను కొనుగోలు చేస్తారు. కానీ అవి తియ్యగా ఉండవు. లేత పసుపు పుచ్చకాయ ఖచ్చితంగా తీపి, ఎరుపు రంగులో ఉంటుంది. పుచ్చకాయ అడుగున పసుపు రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే అది తియ్యగా ఉంటుంది. మీరు పుచ్చకాయ కొనడానికి వెళితే దానిని మీ చేతితో ఎత్తండి. మరొక చేత్తో దానిపై కొట్టండి. పుచ్చకాయ తియ్యగా ఉంటే ఒక రకమైన శబ్దం వస్తుంది. దీనిని బట్టి అది తియ్యగా ఉంటుందో లేదో తెలిసిపోతుంది.

పుచ్చకాయని కొనుగోలు చేసేటప్పుడు దానికి రంధ్రాలు లేకుండా చూసుకోండి. అలాగే ఈ రోజుల్లో పుచ్చకాయ త్వరగా పెద్దగా కావడానికి హాని కలిగించే ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఇలాంటి పుచ్చకాయలకి దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ బరువుగా నిండుగా ఉన్నట్లు అనిపిస్తే అది రుచిగా ఉండదు. పుచ్చకాయ తక్కువ బరువు ఉంటే రుచిలో బాగుంటుంది.

Tags:    

Similar News