High BP: బీపీ అధికంగా ఉంటే ఈ ఆయిల్‌ బెస్ట్‌.. సమస్య అదుపులో ఉంటుంది..!

High BP: భారతదేశంలో చాలామంది హై బీపీతో బాధపడుతున్నారు.

Update: 2023-06-16 14:30 GMT

High BP: బీపీ అధికంగా ఉంటే ఈ ఆయిల్‌ బెస్ట్‌.. సమస్య అదుపులో ఉంటుంది..!

High BP: భారతదేశంలో చాలామంది హై బీపీతో బాధపడుతున్నారు. బీపీ అనేది చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఇతర రోగాలు సంభవిస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొంటాయి. ఈ రోజుల్లో యువత ఎక్కువగా దీని భారినపడుతుంది. దీనినే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది సమయానికి కంట్రోల్‌ కాకపోతే గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి భయంకర వ్యాధులకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే నువ్వుల గింజలతో అధిక బీపీని కంట్రోల్‌ చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం.

రక్తపోటులో నువ్వులు

హైపర్ టెన్షన్ రోగులు నిత్యం నువ్వులను తీసుకుంటే వారి సమస్య దూరమై రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్‌లో లభించే కొన్ని ఆహారాలలో కూడా నువ్వులని వాడుతారు. ఇవి తరచుగా తీసుకుంటు ఉండాలి. నిజానికి నువ్వులు చాలా ఆరోగ్యకరమైనవి రక్తపోటు సమస్యను తొలగించడంలో సహాయపడతాయి.

2. నువ్వుల మిక్స్‌ ఆహారాలు

మనం నిత్యజీవితంలో తీసుకునే ఆహారాలలో నువ్వులని భాగం చేసుకోవాలి. పప్పులని ఏ విధంగానైతే ఉపయోగిస్తామో అలాగే నువ్వులని కూడా ప్రతి వంటకంలో వాడేవిధంగా చేసుకోవాలి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా బరువు కూడా పెంచవు. ఆరోగ్యకరమైన ఆహారంతో నువ్వులను మిక్స్ చేస్తే అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.

3. నువ్వుల నూనె

హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లయితే సాధారణ వంట నూనెలకు బదులుగా నువ్వుల నూనెతో చేసిన ఆహారాన్ని తినడం ఉత్తమం. ఈ నూనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News