Dry Cough: వేసవిలో పొడిదగ్గు వస్తుందా.. అయితే ఇలా చేయండి..!

Dry Cough: చలికాలంలో జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొంతమందిలో మాత్రం వేసవికాలంలోనూ పొడిదగ్గు సతాయిస్తుంటుంది.

Update: 2023-04-21 14:00 GMT
Here are Tips for Dry Cough in Summer

Dry Cough: వేసవిలో పొడిదగ్గు వస్తుందా.. అయితే ఇలా చేయండి..!

  • whatsapp icon

Dry Cough: చలికాలంలో జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొంతమందిలో మాత్రం వేసవికాలంలోనూ పొడిదగ్గు సతాయిస్తుంటుంది. గొంతు వెనుక భాగంలో ఒక రకమైన చికాకు వల్ల పొడిదగ్గు వస్తుంటుంది. ఈ చికాకుకు చాలా కారణాలు ఉండొచ్చు. చికాకు ఎక్కువ రోజులు ఉంటే దగ్గు కూడా ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది.

పొడిదగ్గుకు కారణాలు:

గాలిలో దుమ్ము, ధూళి, పూల పుప్పొడి ఇతర కారకాల వల్ల గొంతులో చికాకు పుడుతుంది. ఈ చికాకు వల్ల దగ్గు వస్తుంది. గొంతు వెనుకభాగంలో పొడిబారడం వల్ల కూడా చికాకు వచ్చి దానివల్ల దగ్గు రావచ్చు. ఇక వేసవిలో గాలి పొడిగా ఉంటుంది. తేమ ఉండదు. ఈ పొడిగాలిని పీల్చుకోవడం వల్ల ముక్కు, గొంతులోని వాయుమార్గాలు చికాకుకు గురవుతాయి. ఈ ఇరిటేషన్ దగ్గుకు దారి తీస్తుంది. అలాగే ఎండాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. తేమ లేని పొడిగాలి వల్ల కాలుష్య కారకాలు ఒక చోటు నుండి చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఈ కారణాల వల్ల శ్వాస నాళాలు ఇరిటేట్ అయ్యి దగ్గు రావచ్చు.

వేసవి దగ్గు నివారణకు చిట్కాలు

పొడిగాలి వల్ల వచ్చే దగ్గును తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం ఉత్తమ మార్గం. అంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎండాకాలంలో చెమట రూపంలో ఎక్కువ నీరు పోతుంది. కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి.

నివారించాల్సినవి

పుప్పొడి, కాలుష్య కారకాలు గొంతు అలెర్జీకి కారణం అవుతాయి. వీలైనంత వరకు వీటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ఫిల్టర్స్ వంటివి ఉపయోగిస్తే బయట కాలుష్యాన్ని వడపోసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వీలు ఉంటుంది.

గోరువెచ్చని నీరు తాగాలి

ఎండాకాలంలో చల్లని నీరు తాగాలనిపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నప్పుడు చల్లని నీటి వల్ల ఉపశమనం అనిపిస్తుంది. అయితే చల్లటి నీటి వల్ల గొంతు ఇన్ ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతులో చికాకును దూరం చేసుకోవచ్చు. దగ్గు ఎక్కువ కాలం ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుని వద్దకు వెళ్లాలని గుర్తుంచుకోండి. గొంతులో వచ్చిన ఇన్ ఫెక్షన్ ను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే దగ్గు నుంచి బయటపడొచ్చు.

Tags:    

Similar News