Tiger Nuts: మీకు టైగర్ నట్స్ గురించి తెలుసా.? ఇంతకీ వీటి ఉపయోగం ఏంటంటే..
టైగర్ నట్స్ వీటి గురించి మనలో చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది.
టైగర్ నట్స్ వీటి గురించి మనలో చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. చూడ్డానికి చిన్న సైజ్ బాదం పరిమాణంలో ఉండే వీటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా పండించే ఈ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచికి తియ్యగా ఉండే ఈ నట్స్‌లో బోలేడన్నీ పోషకాలు ఉన్నాయి. ఇంతకీ టైగర్ నట్స్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* టైగర్ నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. నిత్యం ఉల్లాసంగా ఉండాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* జీర్ణ సంబంధిత సమస్యలకు టైగర్ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను బలాదూర్ అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపుబ్బరం వంటి సమస్యలకు కూడా టైగర్ నట్స్ ఎంతో ఉపయోగపడతాయి.
* బరువు తగ్గాలనుకంటున్నారా.? అయితే తీసుకునే ఆహారంలో టైగర్ నట్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా లభించే ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
* గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా టైగర్ నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ రక్త ప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో తోడ్పడుతుంది.
* ఇక షుగర్ పేషెంట్స్ సైతం టైగర్ నట్స్‌ను తీసుకుంటే మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో ఉపయోగపడుతుంది.
* టైగర్ నట్స్‌లో క్యాల్సియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో దోహదపడుతుంది. ఎముకలు దృఢంగా మారడంలో సహాయపడుతుంది.