Teacher's day 2024 wishes: స్నేహితులకు, గురువులకు టీచర్స్ డే సందర్భంగా మంచి స్ఫూర్తి దాయకమైన కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలపండిలా

Teacher's day2024 wishes: నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశం గర్వించదగ్గ తత్వవేత్తగా పేరుపొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశంలో విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

Update: 2024-09-05 06:27 GMT

Teacher's day2024 wishes: నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశం గర్వించదగ్గ తత్వవేత్తగా పేరుపొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశంలో విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనకు విద్య నేర్పిన గురువులకు కృతజ్ఞతగా ఒక రోజున కేటాయించి వారిని సన్మానించుకోవడం అనేది మనం వారికి ఇచ్చే గౌరవంగానూ, మన కనీస బాధ్యతగాను భావించాల్సి ఉంటుంది. టీచర్స్ డే సందర్భంగా మీ గురువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ పేర్కొన్న కొన్ని స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు ఈ కొటేషన్స్ ను మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయవచ్చు. ఆ కొటేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

1. మన వద్ద నుంచి డబ్బు దొంగలించవచ్చు

ఆస్తులు కొల్లగట్టవచ్చు

మన వద్ద నుంచి సర్వస్వం లాక్కోవచ్చు

కానీ జ్ఞానాన్ని మాత్రం ఎవరు అంతం చేయలేరు, దొంగతనం చేయలేరు

అటువంటి జ్ఞానాన్ని మన్నించిన గురువుకు వందనం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

2. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు ఆ జన్మకు ఒక సార్ధకతను చేకూరుస్తాడు

కర్తవ్య బోధ చేస్తాడు.. మీ జీవితానికి మార్గం ఏర్పాటు చేస్తాడు

అలాంటి గురువుకు వందనం.. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు..

3. మన శరీరంలో కళ్ళు వాటికి చూపు ఎంత అవసరమో

మన జీవితానికి విద్య ఉపాధ్యాయుడు కూడా అంతే అవసరం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

4. తాను కొవ్వొత్తిలా వెలుగుతూ నలుగురికి జ్ఞాన జ్యోతిని పంచే మన జీవితానికి ఒక మార్గాన్ని చూపిన గురువుకు వందనం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

5. వియలేని వాడు వింత పశువు..

అంతటి ప్రాధాన్యం ఉన్న విద్యను అందించిన గురువు ప్రత్యక్ష దైవంతో సమానం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

Similar News