Friendship Day 2023: స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. ఈ ఏడాది ఫ్రెండ్‌షిప్ డే థీమ్‌ ఏంటంటే..?

Friendship Day 2023: స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడి పోదురా..ప్రపంచంలో స్నేహబంధం కంటే గొప్ప బంధం మరేది లేదు.

Update: 2023-08-06 00:30 GMT

Friendship Day 2023: స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. ఈ ఏడాది ఫ్రెండ్‌షిప్ డే థీమ్‌ ఏంటంటే..?

Friendship Day 2023: స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడి పోదురా..ప్రపంచంలో స్నేహబంధం కంటే గొప్ప బంధం మరేది లేదు. సంతోషం, దుఃఖం రెండింటిలోనూ మద్దతునిచ్చే ఏకైక బంధువు స్నేహితుడు మాత్రమే. ఏ పరిస్థితుల్లోను నిన్ను ఒంటరిగా వదలనివాడు స్నేహితుడు మాత్రమే. ఏ కష్టమొచ్చినా నేనున్నా అని భరోసా ఇచ్చేవాడు స్నేహితుడు మాత్రమే. చివరికి కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని విషయాలని అర్థం చేసుకునేవాడు స్నేహితుడు మాత్రమే. స్నేహం కోసం ప్రాణాలు అర్పించినవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఫ్రెండ్‌షిప్ డే గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకదాని ప్రకారం US ప్రభుత్వం 1935 సంవత్సరంలో ఆగస్టు మొదటి ఆదివారం ఒక వ్యక్తిని చంపింది. ఆ వ్యక్తి మృతిని అతని స్నేహితుడు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహంలో కలిసి జీవించడం చనిపోవడం జరిగింది. దీంతో అమెరికా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకుంది. క్రమంగా ఈ ట్రెండ్ ఇతర దేశాలకు వ్యాపించింది. కానీ 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూలై 30న అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే ప్రకటించింది.

2023 ఫ్రెండ్‌షిప్‌ డే థీమ్

స్నేహంతో మానవ స్ఫూర్తిని షేర్‌ చేయండి అనేది ఈ సంవత్సరం స్నేహితుల దినోత్సవం థీమ్. అంటే మానవుల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించాలని దీని ఉద్దేశ్యం. ఫ్రెండ్‌షిప్‌ డే స్నేహితుల పట్ల కృతజ్ఞత, ప్రేమను వ్యక్తపరచడానికి మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ రోజున స్నేహితులతో సమయం గడపడం, యాత్రలు చేయడం, బహుమతులు ఇవ్వడం, సందేశాలు పంపడం, పాటలు అంకితం చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో స్టేటస్‌లు పోస్ట్ చేయడం వల్ల మీ అభిప్రాయాలని అందరికి తెలియజేయవచ్చు.

Tags:    

Similar News